»   »  సీన్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా చేస్తా....

సీన్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా చేస్తా....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mallika Sherawat
'మర్ఢర్' తో మగవాళ్ళ మతులుపోగిట్టిన సెక్సీ భామ మల్లికా షెరావత్. ఆమె ఇప్పుడు నటనలోనే కాదు...మాటల్లోనూ బోల్డ్ గా ఉండటానికి ప్రయత్నం చేస్తోంది. కథ ప్రకారం అవసరమైతే ఎలాంటి ఎక్స్ పోజింగ్ కైనా రెడీ అంటానని...తను దర్శక, రచయితలు తెచ్చే కథలు మార్చమని,వారి ఫీల్ పోగట్టనని అంటోంది. అంతేగాక సీన్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించాటానికైనా సరేనంటూ స్టేట్ మెంట్స్ ఇస్తోంది.

నటనను వృత్తిగా స్వీకరించిన తర్వాత ఎలాంటి పాత్ర వచ్చినా సొంత అభిప్రాయాలకు తావివ్వక లీనమవ్వాలంటోంది. అప్పుడే అధ్బుతాలు జరుగుతాయని...మరుపురాని చిత్రాలు వస్తాయని అంటోందిట. ఎందుకిలా మల్లిక హఠాత్తుగా మాటలతో ముందుకొస్తోందని కొందరు ఆలోచిస్తే అసలు రహస్యం తట్టిందిట. బాలీవుడ్ సుందరీమణులంతా హాలీవుడ్ వైపు ప్రయాణం పెట్టుకున్న ఈ సమయంలో ఆమెకీ ఆ తరహా ఆలోచనలు వచ్చాయట.

దాంతో హాలీవుడ్ వారిని ఆకర్షించటానికి...తనకే కరక్టుగా అర్హత ఉందని చెప్పేందుకే ఈ ప్రకటనలుట. అందులోనూ 'ది మిత్' చిత్రంలో జాకీచాన్ ప్రక్కన చేసిన దగ్గరనుండీ ఇలా తయారైందిట. హాలీవుడ్ లో దాదాపు ప్రతీసినిమాలో నగ్న సన్నివేశాలు ఉంటాయని ...తాను అందుకు రెడీనే అని అన్యాపదేశంగా చెప్తోందిట. ప్రస్తుతం ఆమె రెచ్చిపోయి చేసిన దశావతారం ఎల్లుండి రిలీజవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X