పవన్ తో జడకడుతున్న బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ లేడీ...!?
హిందీ బ్లాక్ బస్టర్ 'దబాంగ్' తెలుగు రీమేక్ అయిన 'గబ్బర్ సింగ్' షూటింగు ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతోంది. గత కొన్ని రోజులుగా హీరో పవన్ కల్యాణ్ లేని సన్నివేశాలను దర్శకుడు హరీష్ శంకర్ షూట్ చేస్తున్నాడు.
ఈ చిత్రం కోసం పవన్ కల్యాణ్ ఏకధాటిగా ఏభై రోజులు కేటాయిస్తున్నాడట. అక్టోబర్ 10 నుంచి ఆయన ఈ సినిమా షూటింగులో పాల్గొంటాడు. ఈ షెడ్యుల్ లో టాకీ దాదాపు పూర్తి చేయడానికి ప్లాన్ చేశారు. పవన్ కల్యాణ్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఐటెం సాంగ్ ను ఓ హిందీ నటి(మల్లికా శరావత్) చేస్తుందని అంటున్నారు. కాగా శింబు హీరోగా నటిస్తున్న తమిళ వెర్షన్ (ఓస్తీ)చిత్రంలో రీమాసేన్ లేదా శ్రియ చేసే అవకాశాలున్నాయట.
మరి తెలుగులో వారిని తీసుకోకుండా మల్లికా శరావత్ ను ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో..?వచ్చే సంక్రాంతికి దీనిని రిలీజ్ చేయడానికి నిర్మాత గణేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళం వెర్షన్ కి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా తెలుగులో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











