For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్ స్టార్‌తో మల్లికా షెరావత్ ఎఫైర్

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ ప్రస్తుతం హాలీవుడ్ అవకాశాల కోసం విదేశాల్లో తిష్ట వేసిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో హాలీవుడ్ స్టార్ ఆంటోనియా బాండెరాస్‌తో ఆమె ఎఫైర్ ఫెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తను నటించి బాలీవుడ్ మూవీ 'కిస్మ్ లవ్ పైస దిల్లి' చిత్రం ప్రమోషన్లో పాల్గొన్న మల్లికాను ఈ విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా....నో కామెంట్ అంటూ ఈ విషయాన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేసింది. మల్లికా షెరావత్ అలా స్పందించడంతో వీరిద్దరి మధ్య సం'బంధం' ఉందనే వార్తలకు బలం చేకూరినట్లయింది.

    'కిస్మత్ లవ్ పైసా దిల్లి' ఈ చిత్రానికి సంజయ్‌ కందూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మల్లిక హర్యానా అమ్మాయిగా, వివేక్‌ ఒబెరాయ్‌ ఢిల్లీ కుర్రాడిగా నటించనున్నారు. ఈ సినిమాలో మల్లికను హాట్ హాట్ గా కనిపించనుంది. గత కొంత కాలంగా ఐటం సాంగులకే పరిమితం అయిన మల్లిక చాలా రోజుల తర్వాత ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు తేజ్ అనే చిత్రంలోనూ ప్రత్యేక పాత్రలో కనిపించబోతోంది.

    మర్డర్ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్లికా షెరావత్...ఆ తర్వాత హీరోయిన్‌గా కాకుండా ఐటం బాంబుగా పాపులర్ అయింది. హిస్ సినిమా ద్వారా అటు హాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే మల్లిక అనుకున్న స్థాయికి మాత్రం చేరుకోలేక పోయింది. దీంతో హీరోయిన్ గా ఎదిగేందుకు కొంత కాలం ఐటం నెంబర్లకు దూరంగా ఉంది. అయితే అవకాశాలు పూర్తిగా తగ్గడంతో...ఇటు హీరోయిన్ గా ప్రయత్నిస్తుండటంతో పాటు అవకాశాలను బట్టి ఐటం సాంగుల్లో తళుక్కుమంటోంది.

    English summary
    While the rumors are doing the rounds about actress Mallika Sherawat having an alleged affair with Hollywood big shot Antonio Banderas, the former has decided to remain mum over this matter. It has been reported, during the promotion of her upcoming film Kismet, Love, Paisa, Dilli, when Ms Sherawat was asked about her rumored relationship with Banderas, Mallika maintained a no comment attitude.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X