నాగార్జున నిర్మాతకు నరకం చూపిస్తున్న...
నాగార్జున తనకు గురు సమానుడని ఇంటర్వూలలో చెప్పి ఆఫర్స్ పట్టిన మమతా మోహన్ దాస్ ఇప్పుడా ఆ నిర్మాతను నానా రకాలుగా ఏడిపిస్తోందని సమాచారం. కింగ్ నిర్మాత డి.శివ ప్రసాద్ నిర్మిస్తున్న రమ్మీ(పేరు మారచ్చు)కోసం షూటింగ్ ని డిసెంబర్ ఏడు నుంచీ విదేశాలలో పెట్టుకున్నారు. యూనిట్ మొత్తం డిసెంబర్ మూడున వెళ్ళిపోతోంది. వారితో పాటే మమతా కూడా వెళ్ళటానికి కమిట్ అయ్యింది. అయితే చివరి నిముషాల్లో తనకు నాలగవ తేదీన చెన్నై లో ఓ అపాయింట్ మెంట్ ఉందని రాలేనని హ్యాండ్ ఇచ్చింది. యూరప్ లో సాంగ్ పిక్చరైజేషన్ కోసం ఈ ట్రిప్ ఏర్పాటు చేసారు. నాగార్జున,మమతామోహన్ దాస్ ల మీద ఆ సాంగ్ వస్తుంది. అయితే తనకు ఇక్కడ పని పూర్తయిన వెంటనే బయిలుదేరి వస్తానని చెప్పింది. దాంతో చివరి నిముషాల్లో వచ్చిన ఈ ట్విస్టుకు శివప్రసాద్ రెడ్డి ఓకే అనక తప్పలేదు. హీరోయిన్ లేకుండా వెళ్ళి ..అక్కడ చిక్కుకుపోవటం ఇష్టపడకపోయినా నాగార్జున మాట మీద బయిలుదేరుతున్నారని తెలుస్తోంది. ఇక మమతా ఆమె తల్లి మొదట ఎకానమీ క్లాస్ లో ప్రయాణం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పడు బిజినెస్ క్లాస్ లో వస్తామని పట్టు పడుతున్నారు. దాంతో అసలు వారు వస్తారా..ఆమె లేకుండానే సాంగ్ ఫినిష్ చేయాలా ఏమిటన్నది అర్ధం కాని స్ధితిలో పడ్డారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











