బాలయ్యకు మమతా మోహన్ దాస్ ఎస్.ఎమ్.ఎస్
బాలకృష్ణ లెటెస్ట్ చిత్రం సింహాలో మమతామోహన్ దాస్ కి ఆఫర్ వచ్చింది. అయితే ఆ పాత్ర చేయటానికి ఆమె రెడీగా లేదు. దాంతో బాలకృష్ణతో ప్రొఫిషనల్ రిలేషన్ షిప్ పోగూడదని ఓ ఎస్.ఎమ్.ఎస్ ఇచ్చింది. ఆ ఎస్.ఎమ్.ఎస్ లో నాకు మీ చిత్రానికి కేటాయించటానికి సరపడ డేట్స్ లేక నిరాకరిస్తున్నాను. అంతే తప్ప వేరే ఆలోచనలు ఏమీ లేవు..అంటూ వివరించింది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు ఆమె ప్రస్తుతం కెరీర్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు గురించి చెపుతూ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఆమె కేడీ చిత్రంలో నాగార్జున సరసన చేస్తోంది. ఆ పాత్రను వివరిస్తూ...ఈ చిత్రంలో నా పాత్రకు రకరకాల షేడ్స్ తో ఉంటుంది. చాలా న్యాచురల్ గా నా క్యారెక్టర్ ని తీర్చిదిద్దారు. ఈ లేటెస్ట్ తరానికి ఖచ్చితంగా నా పాత్ర నచ్చుతుంది. ఆ పాత్ర చాలా కార్టూన్ లా ఉండక రక్త,మాంసాలు నిండి ఉన్న మనిషిలా బిహేవ్ చేస్తుంది. అలాగని ఫెరఫెక్ట్ అమ్మాయి పాత్ర మాత్రం కాదు అంటోంది. ఇంతకు ముందు కింగ్, యమదొంగ చిత్రాలలో కూడా ఆమె నెగిటివ్ పాత్రనే చేసింది..అట్లాంటిదా అంటే దానికీ,దీనికీ సంభందం ఉండదని అంటోంది.


Click it and Unblock the Notifications











