సంగీత దర్శకురాలి అవతారమెత్తుతున్న హీరోయిన్?
గాయినిగా, నటిగా తెలుగు పరిశ్రమకి పరిచయమున్న మమతా మోహన్ దాస్ త్వరలో సంగీత దర్శకురాలు అవతారం ఎత్తుతోంది. నాగార్జున తో చేసిన కేడీ చిత్రం తర్వాత గ్యాప్ తీసుకున్న ఆమె మళ్లీ తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇలా ఇస్తోంది. అయితే ఈమెకు సంగీత దర్సకురాలుగా అవకాశం ఇచ్చింది. ఒక ప్రముఖ నిర్మాత అని తెలిసింది. ఆ నిర్మాత ఎవరు, ఏ సినిమాకి చేస్తోంది..అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటన వెలువడాల్సిందే. ఇక ప్రస్తుతం మమత...అమీర్ సినిమాలో చేస్తోంది. రెండు సినిమాలు వదులుకుని మరీ 'ఆదిభగవాన్'కి డేట్స్ ఇచ్చింది. అందులో నేను మోడర్న్ గాళ్ గా నటిస్తున్నాను. 'జయం' రవి హీరోగా చేస్త్తున్నారు' అంటోంది.


Click it and Unblock the Notifications











