'నాగ్' ను ఆకట్టుకున్న భామ
సింగర్ గా తన హస్కీ వాయిస్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేసిన కేరళ కుట్టి మమతా మోహన్ దాస్. అటు పై 'యమదొంగ'తో కథానాయిగా పరిచయమైన ఈమె తన వాయిస్ తోనే కాకుండా తన అందాలతో కూడా యువత మతిని పోగొడుతోంది. 'కింగ్' తర్వాత టాలీవుడ్ కు దూరమైన ఈమె తన మాతృభాష మలయాళంలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ప్రముఖ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి కామాక్షి మూవీస్ పతాకం పై రూపొందిస్తున్న చిత్రంలో నాగార్జున సరసన నాయికగా ఎంపికైన విషయం తెలిసిందే.
కాగా నాగ్ గత చిత్రం 'కింగ్'లో నటించిన ఈ భామ వృత్తిపరంగానూ, ప్రవర్తనా పరంగానూ నాగ్ ను ఆకట్టుకుందట. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా తెలిపారు. కింగ్ చిత్రంలో నటించిన మమత ఎంతో ఇన్ వాల్వ్ మెంట్ తో పనిచేస్తుందని, ఆమె పర్ఫార్మెన్స్ కూడా నచ్చుతుందని కితాబిచ్చారు. ఇలా నాగ్ వల్లే మమతకు ఈ సినిమాలో అవకాశం వచ్చిదనేది సినీవర్గాల భోగట్టా...
nagarjuna mamatha mohandas king yamadonga kamakshi movies trisha d shiva prasad reddy నాగార్జున మమతా మోహన్ దాస్ కింగ్ యమదొంగ కామాక్షి మూవీస్ డి.శివప్రసాద్ రెడ్డి


Click it and Unblock the Notifications