ప్రేమలు మమిత బైజుకు బంపర్ ఆఫర్.. బాలకృష్ణ రీమేక్ మూవీలో సూపర్ స్టార్ తో..!
కేవలం ఒక్క సినిమా చాలు ఏ నటుడు లేదా నటికి అయినా కూడా మంచి బ్రేక్ అలా మన సౌత్ లో సహా బాలీవుడ్ మార్కెట్ లో కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు లేరు కానీ హీరోయిన్స్ మాత్రం ఉన్నారని చెప్పొచ్చు. కాగా ఇలా నార్త్ ఇండియా సినిమా దగ్గర బోల్డ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అయితే ఎలాంటి బోల్డ్ షో లేకుండానే మన సౌత్ లో కూడా కొందరు హీరోయిన్స్ మంచి ఫేమ్ ని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
కాగా ఇటీవల ఒక్క సినిమాతో అటు మలయాళం సినిమా నుంచి ఇటు తెలుగు సినిమాలో కూడా బాగా పాపులారిటీ తెచ్చుకున్న నటి ఎవరైనా ఉన్నారు అంటే అది "ప్రేమలు" ఫేమ్ క్యూట్ బ్యూటీ మమిత బైజు అని చెప్పాలి. కాగా ఈ యూత్ ఫుల్ సినిమా మోలీవుడ్ లో భారీ హిట్ అయ్యి రికార్డు వసూళ్లు సాధించింది. కాగా ఇక్కడ నుంచి మమిత పేరు కూడా బాగా వైరల్ అయ్యింది.

అలాగే తెలుగులో కూడా మంచి ఆఫర్స్ వచ్చినట్టుగా ఆ మధ్య టాక్ వచ్చింది కానీ ఇపుడు తెలుగు లో కాదు తమిళ్ లో భారీ ఆఫర్ ని మమిత అందుకున్నట్టుగా పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి అది కూడా తమిళ బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి విజయ్ దళపతి లాస్ట్ సినిమాలో నటించే క్రేజీ ఆఫర్ ని మమిత కొట్టేసినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో మమిత హీరోయిన్ గా కనిపించదని గట్టి రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఎందుకంటే ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే ఆల్రెడీ లాక్ అయ్యినట్టుగా వార్తలు ఉన్నాయి. దీనితో పూజా హీరోయిన్ గా నటిస్తే మమిత ముఖ్య పాత్రలో నటిస్తుంది అని తెలుస్తుంది. మరి ఇదంతా చూస్తుంటే మన టాలీవుడ్ మాస్ హిట్ చిత్రం ఒకటి మళ్ళీ గుర్తొస్తుంది. విజయ్ లాస్ట్ సినిమాపై ఆ మధ్య కాలం మంచి హంగామా నడిచింది.
ఇది మన తెలుగు సీనియర్ హీరో బాలయ్య నటించిన "భగవంత్ కేసరి" కి రీమేక్ గా తెరకెక్కనుంది అని టాక్ వచ్చింది. కాగా ఆ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్, శ్రీలీల నటించారు. ఇదే కోవలో ఇప్పుడు విజయ్ లాస్ట్ సినిమాలో కాజల్ రోల్ ని పూజా, శ్రీలీల పాత్రని మమిత బైజు చేయనుంది అని గట్టి రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇది దాదాపు నిజం అనిపించేలా ఉంది కానీ ఇంత తక్కువ సమయంలోనే విజయ్ లాంటి బిగ్ స్టార్ లో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది మమిత కెరీర్ లోనే ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించనున్నాడు. వీరు అయితే ఈ సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్ అన్నట్టు అంటున్నారు కానీ ఇప్పుడు భగవంత్ కేసరి షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి.
మరి చూడాలి ఈ సినిమా భగవంత్ కేసరికి రీమేక్ గా వస్తుందా లేక కేవలం కోర్ లైన్ తీసుకొని విజయ్ కి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారా అనేది. కాగా ఆ మధ్య విజయ్ కి భగవంత్ కేసరి సినిమా అమితంగా నచ్చింది అని అందుకే రీమేక్ చేయానికి ఆసక్తి చూపించాడు అని కూడా పలు రూమర్స్ ఉన్నాయి. మరి చూడాలి ఈ సినిమా ఏ సినిమా అనేది..


Click it and Unblock the Notifications











