అంటున్నది మరెవరో కాదు...నటి,గాయని అయిన మమతా మోహన్ దాస్. గాయని గానే కాకుండే హీరోయిన్ గానూ పరిశ్రమలో వరస ఆఫర్స్ తో ముందుకెళ్తున్న ఆమె తాజాగా 'హోమం' చిత్రంలో చేసింది. జె.డి చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆమె చాలా హాట్ గా ఓ పాటలో కనపించనుంది.ఆ పాట గురించి ఆమె చెప్తూ ఆ సినిమాలో నాది సైక్రాటిస్టు పాత్ర అయినా విచిత్రంగా ఆ హాట్ నెంబర్ నాపై తీస్తానన్నారు. నా పాత్రకు ఆ సాంగ్ సూట్ కాదు కదా ఎలా అంటే జె.డి ఈ పాట సినిమాలో కీలకమైందని నచ్చచెప్పి ఒప్పించాడు. నాకు అప్పటకీ అనుమానమే.అయినా జె.డి వినే స్ధితిలో లేడు. ఇక కొరియాగ్రాఫర్ సబ్రినా ఖాన్ డిజైన్ చేసిన స్టెప్పులు కయితే మతే పోయింది.నేను చాలా ఇబ్బందిగా ఫీలియ్యాను. తప్పని స్ధితిలో ఆ హాట్ నెంబర్ చేసా.అప్పటికీ నా కున్న ఇమేజ్ పోతుందని స్ఫష్టంగా తెలిసినా ఏమీ చెయ్యలేని స్ధితిలో చేసాను.అంటూ భాధతో చెప్తోందామె. ఇక మరి మీమీద వచ్చే గాసిప్స్ సంగతి ఏంటంటే మొదట లంక సినిమా చేస్తున్నప్పుడు సురేష్ గోపీ తో నాకు సంభంధం అంటగట్టారు.ఇప్పుడు దేవీప్రసాద్.తర్వాత ఎవరో అంటోంది నవ్వుతూ...