ఖేల్ ఖతమ్...మహేష్ బాబు కర్ఛీఫ్ వేసేసాడు
హైదరాబాద్ : హిట్ వచ్చిన దర్శకుడుతో చిత్రం చేయాలని వెంటనే వేరే వారు బుక్ చేసుకోకుండా కర్ఛీఫ్ లు వేసేయటం హీరోలు రెగ్యుల్ గా చేసే పనే. ముఖ్యంగా జూ.ఎన్టీఆర్ ...ఇదే స్కీమ్ ని ఫాలో అవుతూ వస్తున్నారు. ఆయన కన్ను ఎప్పుడూ హిట్ ఇచ్చిన డైరక్టర్ పైనే ఉండేది. అయితే మహేష్ ఇలాంటి స్కీమ్ లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడాయన కూడా మిగతా హీరోలు లాగ హిట్ ఇచ్చిన డైరక్టర్ ని పిలిచి నెక్ట్స్ ప్రాజెక్టుకు రంగం సిద్దం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నిన్న కొరటాల శివ, ఇప్పుడు మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తో ఆయన వారి తదుపరి ప్రాజెక్టులు ఓకే చేయటం గమనించవచ్చు అంటున్నారు.
ఒక్క హిట్ చాలు...దర్శకుడుకైనా, హీరో కైనా...ఓవర్ నైట్ లో పూర్తి స్ధాయి డిమాండ్ ని తెచ్చి పెట్టడానికి. ఇప్పుడు మనం దర్శకుడు విక్రమ్ కుమార్ పరిస్దితి అలాగే ఉంది. ఓ ప్రక్క మెగా క్యాంప్ ఆహ్వానం పలుకుతూంటే, మరో ప్రక్క మహేష్ లాంటి సూపర్ స్టార్ తనతో చిత్రం చేయమని ఆహ్వానించంటం జరుగుతోంది. విక్రమ్ నెక్ట్స్ మహేష్ తో దాదాపు ఖరారు అయిపోయినట్లే అని తెలుస్తోంది. అయితే వచ్చే సంవత్సరం ఈ ప్రాజెక్టు ఉంటుందని, అప్పటివరకూ స్క్రిప్టు వర్క్ చేసుకుంటారని చెప్తున్నారు.

ఇటీవల మహేష్ 'మనం'చూశారు. ఈ కథని మలచిన తీరు ఆయన్ని ఆకట్టుకొందట. అందుకే విక్రమ్‌తో సినిమా చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం 'ఆగడు'తో బిజీగా ఉన్నారు మహేష్. ఆ తరవాత కొరటాల శివతో ఓ సినిమా చేస్తారు. 2015లో విక్రమ్ కె.కుమార్‌తో సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయి.
'ఇష్క్'తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నారు విక్రమ్ కె.కుమార్. ఇప్పుడు 'మనం'తో మరోసారి హృదయాలను కొల్లగొట్టారు. స్టార్ హీరోలు సైతం 'మనం' చూసి ముగ్థులైపోయారు. 'విక్రమ్‌తో ఓ సినిమా చేయడానికి రెడీ'అంటూ సంకేతాలు పంపారు. ఈ మధ్యనే ఈ దర్శకుడు మహేష్‌బాబుకి ఓ కథ వినిపించి ఓకే చేయించుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











