'మనం' డైరక్టర్ పై మెగా హీరో కర్ఛీఫ్
హైదరాబాద్ : ఇంతకు ముందు రోజుల్లో టాలెంట్ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకునే వారు సినీ జనం. ఇప్పుడు ఎవరైనా ఫలానా వాడు టాలెంట్ ఉన్నవాడు అని తెచ్చి పరీక్షించి, తేల్చితే వెంటనే వారితో ముందుకు వెళ్తున్నారు. తాజాగా తెలుగు హీరోలందరి దృష్టీ ఇప్పుడు 'మనం' డైరక్టర్ విక్రమ్ కుమార్ పై పడింది. దర్శకుడు ఈ మూడు తరాల హీరోలను బాగా డీల్ చేసాడని పేరు తెచ్చుకోవటంతో అతనికి ఆఫర్స్ టాలీవుడ్ ప్రశంశలతో పాటు ఆఫర్స్ ఇస్తోంది. అయితే ఎవరు ముందుగా అతన్ని ఎప్రోచ్ అయి, అతనితో సినిమా చేస్తారనేది ఆసక్తికరమైన అంశం. తాజాగా మెగా హీరో రామ్ చరణ్ ఈ దర్శకుడుతో పనిచేయటానికి ముందుకు వచ్చాడని సమాచారం.
మనం ప్రీమియర్ షో చూసిన రామ్ చరణ్ వెంటనే ఈ నిర్ణయానికి వచ్చాడంటున్నారు. నాగార్జున దగ్గరకి వెళ్లక ముందే 'మనం' రామ్ చరణ్ కి ఈ కథని నేరేట్ చేసారని, అయితే దర్శకుడుపై నమ్మకం లేక ముందుకు వెళ్లలేదని, అసలు ఏ సమాధానం చెప్పలేదని సమాచారం. అయితే ఇప్పుడు ఈ చిత్రం చూసిన రామ్ చరణ్ చాలా ఇంప్రెస్ అయ్యారని, వెంటనే తన తరుపునుంచి కంగ్రాట్స్ తెలిపి, తను చేయనున్నాడని దర్శకుడుకి చెప్పాడని తెలుస్తోంది. ఓ రకంగా మిగతా హీరోల కంటే ముందుగా ఈ దర్సకుడుని కర్చీఫ్ వేసాడని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

ఇక 'మనం' డైరక్టర్ విక్రమ్ ఇంతకు ముందు 13బి, ఇష్క్ చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. గతంలో శ్రియ తొలి చిత్రం ఇష్టంకు ఆయనే డైరక్టర్ కావటం విశేషం. ఇక మరో ప్రక్క రామ్ చరణ్ ప్రస్తుతం అక్కినేని కుటుంబం కోసం తయారు చేసి, రిజెక్టు అయిన కథనే చేస్తున్నాడని సమాచారం. అదే...రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్ హీరోయిన్. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











