twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్, అమీర్, రణబీర్‌లతో...హిందీలో ‘మనం’?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన అక్కినేని మూల్టీస్టారర్ మూవీ 'మనం' బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబడుతోంది. ఓవర్సీస్‌లో పలు రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది.

    'మనం' విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని రిలయన్స్ ఎంటర్ టైన్‌మెంట్స్ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తారని టాక్. ఎన్నార్ పాత్రలో అమితాబ్.... నాగార్జున, నాగచైతన్య పాత్రల్లో అమీర్ ఖాన్, రణభీర్ కపూర్‌ అయితే బాగుంటుందని భావిస్తున్నారట.

    MANAM hindi remake with Amitabh, Aamir and Ranbir

    అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషించారు.

    ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.

    English summary
    After the success of 'Manam', the ANR starring film is all set to be remade in Hindi. As per reports, Amitabh Bachchan, Aamir Khan and Ranbir Kapoor will be reprising ANR, Nagarjuna and Nag Chaitanya's roles respectively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X