మహేష్‌తో పాటే నాగార్జున కూడా థియేటర్స్‌కి...
హైదరాబాద్: అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'మనం' . మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సమంతాపై ఆరు రోజుల చిత్రీకరణ మినహా 'మనం' షూటింగ్ పూర్తయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్...మహేష్ బాబు తాజా చిత్రం 1 నేనొక్కడినే తో పాటు థియోటర్స్ కు వదలటానికి రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. నేనొక్కడినే చిత్రానికి వచ్చే క్రేజ్...తమ చిత్రం టీజర్ ఎక్కువ మంది చూడటానికి ఉపకరిస్తుందని భావిస్తున్నారని సమాచారం.
నాగార్జున మాట్లాడుతూ.... సంక్రాంతికి ఫస్ట్‌లుక్ టీజర్‌ను విడుదల చేయబోతున్నాం. సినిమా అద్భుతంగా వచ్చింది. సర్జరీ అయిత తర్వాత కూడా నాన్నగారు 'మనం' సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. 'సినిమా పూర్తవడానికి ఇంకా చాలా టైముంది ...మీరు కోలుకున్నాక షూటింగ్ చేసుకోవచ్చు' అని చెప్పినా ఆయన విన్లేదు. వారంరోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇంటిదగ్గరే డబ్బింగ్ కూడా చెప్పారు. అనారోగ్యం వల్ల సమయం ఆలస్యమైతే గొంతులో ఏమైనా మార్పులు రావొచ్చు...డబ్బింగ్ పూర్తి చేద్దామని తొందరపెట్టారు అన్నారు.
అక్కినేని మూడు తరాల హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'మనం' షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈచిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి పిభ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రీమతి అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇష్క్ మూవీ ఫేం విక్రమ్ కుమార్ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వందశాతం కామెడీతో మంచి లవ్ ఫీల్‌తో మంచి ఎమోషనల్‌తో 'మనం' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. నాగేశ్వరరావు గారికి 90 ఏళ్లు వచ్చినా సెట్‌లో అందర్నీ నవ్విస్తూ ప్లెజెంట్ ఎట్మాస్పియర్‌ని క్రియేట్ చేస్తారు. యూనిట్లో అందరికంటే ఎనర్జిటిక్‌గా ఉంటూ అందరినీ ఉత్సాహపరుస్తారు. ఆయనొక లెజెంట్. లెజెండ్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చారు దర్శకుడు.
ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.


Click it and Unblock the Notifications












