PSPK28: పవన్ కల్యాణ్‌ హీరోయిన్‌గా మానస రాధాకృష్ణన్.. ఈమె ఎవరంటే!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో 28వ చిత్రంగా రూపొందే PSPK28 చిత్రానికి సంబంధించిన ప్లాన్ పక్కాగా జరిగిపోతున్నది. లాక్‌డౌన్ ఎత్తేసే సమయానికి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే పనిలో చిత్ర యూనిట్ వర్క్ చేస్తున్నది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించే హీరోయిన్ ఈమే అంటూ ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే..

మైత్రీ మూవీస్‌తో పవన్ కల్యాణ్ సినిమా

మైత్రీ మూవీస్‌తో పవన్ కల్యాణ్ సినిమా

పవన్ కల్యాణ్ క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు అంటే గత ఏపీ శాసన సభ ఎన్నికలకు ముందే మైత్రీ మూవీ మేకర్స్‌తో సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. ఎన్నికలు రావడం, ఆ తర్వాత పవన్ కల్యాణ్ బిజీగా మారడంతో సినిమాలకు దూరంగా జనసేనాని ఉన్నారు. దాంతో ఆ సినిమాను ఇప్పుడు పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

 దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం

ఇక గబ్బర్ సింగ్ రిలీజై 8 ఏళ్లు పూర్తి చేసుకొన్న రోజును పురస్కరించుకొని PSPK28 సినిమాకు సంబంధించిన ఓ కీలక ప్రకటన వెలువడింది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం వహిస్తున్నారని మైత్రీ మూవీస్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. అలాగే హరీష్ శంకర్ కూడా ఈ వార్తను ధృవీకరించి.. గబ్బర్ సింగ్ లాంటి మ్యాజిక్ రాబోతున్నది అంటూ చిన్న ఝలక్ ఇచ్చారు.

 మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా

మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా

ఇక PSPK28లో పవన్ కల్యాణ్ సరసన మలయాళ హీరోయిన్ మానస రాధాకృష్ణన్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈమెకు ఎంపికకు సంబంధించిన ఇంకా చిత్ర యూనిట్ వెల్లడించలేదు. అయితే ఇటీవల జరిగిన చర్చల సారాంశం ప్రకారం.. ఈ అమ్మాయిని బోర్డుపైకి తీసుకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ హీరోయిన్‌కు సంబంధించిన ప్రకటన అధికారికంగా వెల్లడి కానున్నది.

 మానస రాధాకృష్ణన్ పర్సనల్ లైఫ్

మానస రాధాకృష్ణన్ పర్సనల్ లైఫ్

ఇక మానస రాధాకృష్ణన్ విషయానికి వస్తే.. ఎర్నాకులంకు చెందిన ఈ బ్యూటీ దుబాయ్‌లో పెరిగారు. దుబాయ్‌లోనే సెకండరీ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత త్రిపునితురలోని ది ఛాయిస్ స్కూల్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ముత్తూట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. భారతీయ సంప్రదాయ నృత్యాలు, గిటార్‌లో శిక్షణ పొందారు.

మానస రాధాకృష్ణన్ ప్రొఫెషనల్ లైఫ్

మానస రాధాకృష్ణన్ ప్రొఫెషనల్ లైఫ్

2008లో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన మానస రాధాకృష్ణన్ ఇప్పటి వరకు 13 మలయాళ చిత్రాల్లో నటించారు. ఇందులో మూడింటిలో బాలతారగా కనిపించారు. క్రాస్‌రోడ్స్, సకళ కళాశాల, చిల్డ్రన్స్ పార్క్, ఉరియాది చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. పరమగురు అనే చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X