twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు కాంపౌండ్ లోనే మరోసారి హన్సిక

    By Srikanya
    |

    హైదరాబాద్ : హన్సిక ఇప్పుడు మంచు కాంపౌండ్ హీరోయిన్ అయ్యిపోయింది. హన్సిక తో మంచు హీరో విష్ణు కాంబినేషన్ లో దేనికైనా రెడీ,పాండవులు పాండవులు చిత్రాలు వచ్చి మంచి విజయం సాధించాయి. దాంతో ఆమెను మరోసారి తమ హీరోకి ఎంపిక చేసారు. అయితే ఇప్పుడు హీరో మంచు మనోజ్. ఈ చిత్రానికి దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. . యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రం ఫిభ్రవరి 6న ప్రారంభం కానుంది. ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా సినిమా రూపొందిచే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో మంచు మనోజ్ కొత్త గెటప్ లో కనిపిస్తాడు. లక్ష్మి ప్రసన్న బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది.

    ఇటీవల హన్సికకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. దర్శకులు కొత్త కథలు వినిపిస్తామంటూ వెంటపడుతున్నారట. వరస ఆఫర్స్ తో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇన్నాళ్ళూ బొద్దు పాపలాగ ఉందని ప్రక్కన పెట్టినవాళ్లంతా ఆమె సన్నబడటంతో సై అంటూ ముందుకు దూకుతున్నారు. పట్టుబట్టి మరీ బరువు తగ్గి తన అందాలకు పదును పెట్టిన హన్సిక మళ్లీ పీక్‌టైమ్‌లోకి చేరిందని అంటున్నారు సినీ జనం.

    Hansika

    ఆ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ ''అవును, నేను రోజూ అయిదారు కథల్ని వింటున్నాను. వాటిలో నచ్చిన కథల్ని మాత్రమే ఎంచుకొంటున్నా. కథల ఎంపికలో పరిణతి ప్రదర్శిస్తున్నా. గతంతో పోలిస్తే... తక్కువ తప్పులు చేస్తున్నాను. చేస్తున్న చాలా చిత్రాలు మంచి ఫలితాల్ని తెస్తున్నాయి''అని చెప్పుకొచ్చింది. అయితే సన్నబడటం వల్లే ఆఫర్స్ వస్తున్నాయట కదా? అని అడిగితే... ''అది పూర్తిగా అబద్ధం. బొద్దుగా ఉన్నప్పుడు బోలెడన్ని సినిమాలు చేశాను. ఇలా నాజూగ్గా తయారయ్యాక కూడా సినిమాలు చేస్తున్నా. బరువు నాకు ఎప్పుడూ సమస్య కాలేదు'' అని చెప్పుకొచ్చింది.

    పెళ్లి గురించి మాట్లాడుతూ ''నా చేతినిండా సినిమాలున్నాయి. వ్యక్తిగత జీవితాన్ని కూడా సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నా. ఇక పెళ్లికొచ్చిన తొందరేముంది చెప్పండి? ఇంకా నా వయసు ఇరవై రెండే కదా?'' అని చెప్పుకొచ్చింది. హన్సిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఏడు సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'బిర్యానీ' చిత్రంలో హన్సిక పాత్రికేయురాలిగా కనిపిస్తుందట.

    'దేశముదురు'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తరువాత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టడంతో కెరీర్ కోల్పోయింది. ఆ తరువాత తమిళానికి వెళ్లి గుడి కట్టించుకునే స్థాయికి వెళ్లింది. తాజాగా తెలుగులో నితిన్‌తో ఓ చిత్రం చేస్తోందట. కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. ఇప్పటికే నాగచైతన్య, మంచు విష్ణుతో మరో రెండు చిత్రాలకు కమిట్ అయింది. ఇదే సమయంలో తమిళంలోనూ నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది.

    English summary
    
 Hansika and Manchu Manoj will be romancing in their next film. The shoot of this film which is being directed by G Nageswara Reddy of Denikaina Ready fame will commence very soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X