Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాగార్జున,రవితేజ,నాని,తాప్సీ కలిసి స్టెప్స్
హైదరాబాద్: నాగార్జున, రవితేజ,రానా, నాని, సుశాంత్, శింబు, తాప్సీ అందరూ కలిసి ఒకే పాటలో కనిపించనున్నారా...అవుననే అంటున్నారు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘దొంగాట'. ఈ సినిమాలో ఓ పాటలో తెలుగు స్టార్ హీరోలలో కొందరు స్టెప్పులు వేయనున్నారు. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వంశికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా అతిధి పాత్రలో నటించారు.మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్నారు.
నాగార్జున, రవితేజ, రానా దగ్గుబాటి, నాని, తమిళ హీరో శింబు, తాప్సీ తదితరులు ఓ పాటలో సందడి చేయనున్నారు. ‘దొంగాట' సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెప్తుంది. సాధారణంగా హిందీలో ఎక్కువ ఈ తరహ ట్రెండ్ కనిపిస్తుంది. మన తెలుగులో మొదలవడం సంతోషించదగ్గ అంశం అంటున్నారు.

మంచు లక్ష్మి, అడవి శేష్ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వంశీకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంచు లక్ష్మి నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఓ వినూత్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి దొంగాట అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మి ట్విట్టర్‌లో తెలిపింది.
కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇటీవలే పూర్తి చేశారు. మిగతా షూటింగ్ జరగాల్సి వుంది. ఇందులోని ఓ కీలకమైన అతిధి పాత్రలో రానా కనిపించబోతున్నారు. కథలో తన పాత్రకున్న ప్రాధాన్యతను గుర్తించి రానా ఇందులో నటించడానికి అంగీకరించారని, పాత్ర చిన్నదే అయినా చిత్ర కథను మలుపు తిప్పుతుందని, అందుకే ఆయన్ని ఈ పాత్ర కోసం ఎంపిక చేసుకోవడం జరిగిందని చిత్ర వర్గాలు తెలిపాయి.
మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్నారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. త్వరలో సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.