ఇవాంకా‌తో పాటే మంచులక్ష్మి స్పీచ్: గ్లోబల్ ఎంటర్ ప్రెన్యుర్షిప్ సదస్సు 2017లో లక్ష్మీ ప్రసన్న

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యుర్షిప్ సదస్సు 2017లో అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ వస్తున్న వేళ.. ఆమె అధ్యక్షతన జరిగే ఒక ప్రోగ్రామ్ లో మాట్లాడటానికి లక్ష్మీ మంచును పిలిచారట.

Recommended Video

ఇవాంకా‌ తో పాటే మంచులక్ష్మి నా ?

హైదారాబాద్ లో జరగబయే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యుర్షిప్ సదస్సు ఇప్పుడు హాట్ టాపిక్, ఇటు రాజకీయాలనీ, అటు మీడియానే కాదు ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా ఈ సదస్సు ఒక కీలక చర్చ అయ్యింది. ఆ సదస్సులో మాట్లాడటానికి ఆల్రెడీ బిజినెస్ రంగం‌లో ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందాయని గుసగుసలు వినిపించాయి.

 ఎవరికీ తెలియదు

ఎవరికీ తెలియదు

అయితే ఎవరు వస్తున్నారో రారో ఖచ్చితమైన సమాచారం మాత్రం ఎవరికీ తెలియదు. కాని.. ఎవరి పిఆర్ ఏజన్సీలు వారి స్టార్ లు వస్తున్నారంటూ పాపులర్ చేస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో లక్ష్మీమంచు వంతొచ్చింది. లక్ష్మి కూడా ఆ సదస్సులో మాట్లాడబోతోందట...

లక్ష్మీ మంచును పిలిచారట

లక్ష్మీ మంచును పిలిచారట

ఇప్పుడు తాజాగా అందిన అప్డేట్ ఏంటంటే.. #GES2017లో అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ వస్తున్న వేళ.. ఆమె అధ్యక్షతన జరిగే ఒక ప్రోగ్రామ్ లో మాట్లాడటానికి లక్ష్మీ మంచును పిలిచారట. ఒక ప్రోగ్రామ్ కు సంబంధించి ప్యానలిస్ట్ గా వెళ్లే మంచు లక్ష్మి.. అక్కడ ఇవాంక ముంగిట స్పీచ్ ఇస్తోంది అంటున్నారు పిఆర్ వర్గాలు.

వెయిట్ చేయాల్సిందే

వెయిట్ చేయాల్సిందే

అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మాత్రం.. సదస్సు జరిగే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే అసలు టాలీవుడ్ నుండి ఎవ్వరినీ పిలవవట్లేదు అనుకున్నవేళ.. రామ్ చరణ్ పేరు వినిపించింది. మళ్ళీ చరణ్ రావట్లేదని మరో న్యూస్ వచ్చింది.

మహిళా దినోత్సవం నాడు

మహిళా దినోత్సవం నాడు

ఇప్పుడు కొత్తగా లక్ష్మీ మంచు ఆ కార్యక్రమానికి వెళుతోంది అంటున్నారు. అయితే బిజెపి గవర్నమెంటుతో సత్సంబంధాలు మెయిన్టయిన్ చేస్తున్న మంచు ఫ్యామిలీ.. ఆ మధ్యన నరేంద్ర మోడీని కలవడం.. అలాగే మోడీ మహిళా దినోత్సవం నాడు ట్విట్టర్లో ఫాలో అయిన దేశ మహిళల్లో మంచు లక్ష్మీ కూడా ఉండటం.. ఆమెను పిలిచే ఉంటారు అనే వాదనను బలపరుస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X