వియ్యంకులు కాబోతున్న మంచు మనోజ్.. సాయి ధరమ్ తేజ్.. త్వరలోనే ముహూర్తాలు, శుభలేఖలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు హీరోల మధ్య విబేధాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఈ కాలంలో మాత్రం హీరోలు చాలా స్నేహంగా ఉంటున్నారు. ముఖ్యంగా యువ హీరోలు ఏ మాత్రం విబేధాలు లేకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారనే చెప్పాలి. ఇక అలాంటి వారిలో సాయి ధరమ్ తేజ్ - మంచు మనోజ్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పాలి.

Recommended Video

Manchu Manoj Divorce With His Wife || ఇంక కలిసి బ్రతకలేకే.. మంచు మనోజ్ ట్వీట్
 త్వరలోనే వియ్యంకులు..

త్వరలోనే వియ్యంకులు..

అయితే ఇటీవల మంచు మనోజ్ చెప్పిన ఒక శుభవార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారు త్వరలోనే వియ్యంకులు కాబోతున్నారట. ఇది రూమర్ కాదు. స్వయంగా మంచు వారి అబ్బాయి నుంచి వచ్చిన ట్వీట్. ఫొటోలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. నెటీజన్స్ కూడా డిఫరెంట్ స్టైల్ లో స్పందిస్తున్నారు.

శుభలేఖలు కూడా..

శుభలేఖలు కూడా..

ఒక మంచి అల్లుడిని ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ.. త్వరలోనే ముహూర్తాలు పెట్టించి శుభలేఖలు వెయిస్తాం అని మంచు మనోజ్ చేసిన ట్వీట్ చాలా సరదగా ఉంది. ఇంతకు అసలు మ్యాటట్ ఏమిటంటే... ఈ హీరోలిద్దరి పెంపుడు కుక్కలకు పెళ్లి చేయబోతున్నారట. లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ ఇచ్చిన ఆ పెట్ డాగ్స్ ని రీసెంట్ గా కలిపారట.

పెంపుడు కుక్కల పెళ్లి..

పెంపుడు కుక్కల పెళ్లి..

హస్కి బ్రీడ్ కి చెందిన ఈ పెంపుడు కుక్కలను ఎంతో ఇష్టంగా ఒకేసారి తీసుకున్న ఈ స్టార్స్ వాటి మధ్య కూడా ఒక స్పెషల్ రిలేషన్ ని ఏర్పాటు చేశారు. వాటి పేర్లు ట్యాంగో, జోయా. ఇటీవల సోషల్ డిస్టెన్స్ లో వాటికి ఒక డేట్ సెట్ చేశారు. ఇక త్వరలో పెళ్లి చేయాలని ఉందని మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్పెషల్ ఫోటో..

స్పెషల్ ఫోటో..

మంచి అల్లుడిని ఇచ్చినందుకు నా వియ్యంకుడైన సాయి ధరమ్ తేజ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ.. త్వరలోనే ముహూర్తలతో పాటు శుభలేఖలు కూడా వెయిస్తామని చెప్పడం సరదాగా ఉంది. ఇక వాటి పెంపుడు కుక్కలతో కలిసి ఇద్దరు హీరోలు దిగిన ఫోటో కూడా నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక పెళ్లికి ఎవరెవరిని పిలుస్తారో అంటూ నెటీజన్స్ కూడా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

హీరోల సినిమాల విషయానికి వస్తే..

హీరోల సినిమాల విషయానికి వస్తే..

సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా దేవకట్టాతో మరో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఇక మంచు మనోజ్ మునుపెన్నడు లేని విధంగా అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో ఆ సినిమాను రూపొందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X