మౌనిక రెడ్డి మొదటి పెళ్లికి మంచు మనోజ్.. సినిమా స్టైల్ లో సెకండ్ మ్యారేజ్

ఒక మనిషి తన జీవితంలో ఎప్పుడూ ఎలాంటి విచిత్రమైన సంఘటనలు, పరిణామాలు చోటుచేసుకుంటాయే ఊహించడం కష్టం. ముఖ్యంగా కొన్నిసార్లు సినీ సెలబ్రిటీల విషయాలు మరి విచిత్రంగా ఉంటాయి. ప్రొఫెషనల్ లైఫ్ నుంచి వ్యక్తిగత జీవితం వరకు అస్సలు ఊహించని పరిణామాలు జరుగుతాయి. ఇక సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అంటే ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు మంచు మనోజ్ రెండో వివాహం టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. మంచు మనోజ్ ఇప్పుడు రెండో వివాహం చేసుకుంటున్న మోనిక రెడ్డి మొదటి పెళ్లికి హాజరు కావడం చిత్రసీమలో ప్రస్తుతం విశేషంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

 ప్రేమ వివాహం కాస్తా..

ప్రేమ వివాహం కాస్తా..

బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన మంచు మనోజ్ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మోహన్ బాబు రేంజ్ లో మాత్రం అంతగా పేరు తెచ్చుకోలేకపోయాడు. చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో చాలా కాలం ప్రేమాయణం సాగించి.. 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ ప్రేమ వివాహం కాస్తా విడాకులవైపు వెళ్లింది. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా 2019లో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు.

 దివంగత నాయకుడు..

దివంగత నాయకుడు..

తన విడాకుల గురించి సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించిన మంచు మనోజ్ మళ్లీ సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని కూడా తెలిపాడు. ఆ తర్వాత మంచు మనోజ్ పర్సనల్ విషయాలపై అనేకంగా పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా మనోజ్ రెండో పెళ్లి గురించి రూమర్స్ తెగ వైరల్ అయ్యేవి. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో మనోజ్ వివాహం జరగనున్నట్లు కథనాలు వచ్చాయి.

 మనోజ్ వ్యాఖ్యలతో..

మనోజ్ వ్యాఖ్యలతో..

అయితే ఈ పుకార్లకు మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి గతేడాది సెప్టెంబర్ తొలివారంలో హైదరాబాద్ సీతాఫల్ మండిలోని వినాయక మండపంలో జంటగా కనిపిచండమే కారణ భూతం అయ్యాయి. అప్పుడు పెళ్లి గురించి ప్రస్తావించగా.. అది తన వ్యక్తిగత విషయం అని చెప్పిన మంచు మనోజ్ అదే సంవత్సరం డిసెంబర్ లో కడప దర్గాను సందర్శించాడు. అప్పుడు మనోజ్ చేసిన వ్యాఖ్యలతో ఆయన రెండో పెళ్లిపై క్లారిటీ వచ్చినట్లు అయింది.

కాబోయే భార్య అంటూ..

కాబోయే భార్య అంటూ..

ఇప్పుడు సీన్ కట్ చేస్తే మంచు మనోజ్, మౌనిక రెడ్డి ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. మార్చి 2 నుంచే ప్రీ వెడ్డింగ్ పనులు మొదలు కాగా మెహందీ, సంగీత్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక మంచు మనోజ్-మౌనిక రెడ్డి వివాహం మార్చి 3న రాత్రి 8:30 గంటలకు ఫిల్మ్ నగర్ లోని మంచు లక్ష్మీ ఇంట్లో జరగనున్నట్లు సమాచారం. మంచు లక్ష్మీ మెహందీకి సంబంధించిన ఫొటోలు షేర్ చేయగా.. మనోజ్ తనకు కాబోయే భార్య అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

మొదటి పెళ్లికి హాజరు..

మొదటి పెళ్లికి హాజరు..

త్వరలో రెండోసారి వివాహ బంధంతో ఒక్కటి కానున్న మంచు మనోజ్, మౌనిక రెడ్డిలకు సంబంధించిన ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. 2015లో బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డి అనే ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు మౌనిక రెడ్డి. ఈ పెళ్లి వేడుకకు మంచు మనోజ్ అతిథిగా హాజరయ్యాడని ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. మౌనిక రెడ్డి మొదటి పెళ్లికి హాజరై ఇప్పుడు ఆమెనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ వార్తల సారాంశం.

 మోహన్ బాబు దూరంగా..

మోహన్ బాబు దూరంగా..

అయితే మౌనిక రెడ్డి మొదటి పెళ్లికి మంచు మనోజ్ హాజరైనట్లు వస్తున్నట్లు వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు. కానీ ఇదంతా మాత్రం ఏదో సినిమాలో చూపించినట్లుగా.. మౌనిక రెడ్డి, మనోజ్ పెళ్లి ఉందని పలువురు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. మంచు మనోజ్ రెండో పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మౌనిక రెడ్డి ఫ్యామిలీ, బంధువులు తమకు అనుకూలమైన వైఎస్సార్ పార్టీకి ప్రత్యర్థులైన టీడీపీకి సంబధించినవాళ్లు కావడమే కారణంగా చెబుతున్నారు. అందుకే అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో మంచు లక్ష్మీ ఇంట్లో ఈ పెళ్లి జరిపిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X