మంచు మనోజ్ ఫస్ట్ స్టెప్.. ఏకంగా ఇద్దరితో! వెరీ ఇంట్రెస్టింగ్
కేవలం సినిమాల్లోనే గాక పలు రంగాల్లో సొంతంగా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు నేటితరం యంగ్ హీరోలు. ఇప్పటికే మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ లాంటి హీరోలు తమ తమ సొంత ప్రొడక్షన్ హౌసెస్ అనౌన్స్ చేసి సినిమాలు రూపొందిస్తుండగా, అదే బాటలో ప్రయాణించాలని డిసైడ్ అయ్యాడు మరో యంగ్ హీరో మంచు మనోజ్. ఈ మేరకు ఇటీవలే తన ప్రొడక్షన్ హౌస్‌కి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే మంచు ఫ్యామిలీలో మూడు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అయినప్పటికీ తాను సొంతంగా మరో బ్యానర్ ప్రారంభిస్తున్నాని మంచు మనోజ్ తెలిపారు. తన బ్యానర్ పేరు ఎం.ఎం.ఆర్ట్స్ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక నుంచి తన బ్యానర్‌లో సినిమాలు రూపొందిస్తానని చెప్పారు. అయితే తాజాగా మంచు మనోజ్ సొంత బ్యానర్‌పై రాబోతున్న మొదటి సినిమా గురించి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది.

ప్రస్తుతం ఫిలిం నగర్‌లో నడుస్తున్న టాక్ ప్రకారం ఇప్పటికే మంచు మనోజ్ తన బ్యానర్‌లో చేయబోయే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారట. ఇందులో మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే.. ఇది మల్టీస్టారర్ సినిమా కావడం. తన ఫస్ట్ స్టెప్ మల్టీస్టారర్ సినిమాతోనే ప్రారంభం కావాలని మనోజ్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
ఇక ఇటీవలే మంచు మనోజ్ విడాకుల వ్యవహారం వైరల్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన భార్యతో విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించారు మంచు మనోజ్. చూడాలి మరి రాబోయే రోజుల్లో మనోజ్ స్టెప్స్ ఎలా ఉంటాయనేది!.


Click it and Unblock the Notifications











