మంచు మనోజ్ కూడా అదే దారిలో..
దసరా సీజన్ అంటే సినిమా వాళ్లకి పండగే పండగ. స్కూళ్లు, కాలేజీలకు సెలవు దినాలు, పైగటా పండగ. దీంతో ధియేటర్లన్నీ కళకళలాడుతుంటాయి. ఈ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే చాలా మంది హీరోలు దసరాకు తమ సినిమాలను విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. తాజాగా మంచు మనోజ్ కూడా వారి దారిలోనే నడువనున్నాడు. మనోజ్ నటిస్తున్న 'మిస్టర్ నోకియా" చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని నిర్ణంచినట్లు సమాచారం. త్వరలో ఆడియో విడుదల తేదీతో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటించేందుకు దర్శక నిర్మాతలు సిద్దం అవుతున్నట్లు తెలుస్తూంది.
ఈ సినిమాలో మనోజ్ సరసన కృతి కర్భంధ, సనా ఖాన్ లు లీడ్ రోల్స్ చేస్తున్నారు. శ్రియ ఓ స్పెషల్ సాంగులో కనిపించ బోతోంది. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీశైలేంద్ర మూవీస్ బ్యానర్ పై డి.ఎస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











