టాలీవుడ్‌లో మరో బిగ్ మల్టీస్టారర్: వెంకటేష్‌తో రాకింగ్ స్టార్.. ఎలా కనిపిస్తాడో తెలిస్తే!

ఒకప్పుడు టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు పెద్దగా వచ్చేవి కాదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం అలాంటి వాటిని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దీంతో హీరోలు, దర్శక నిర్మాతలు కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చి అలరించాయి. పైగా ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మరో మల్టీస్టారర్ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఇంతకీ అందులో ఎవరు నటిస్తున్నారు? ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

అనిల్‌తో వెంకటేష్ ఫిల్మ్:ఒకప్పుడు సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చినా... ఈ మధ్య కాలంలో మాత్రం చాలా స్లో అయిపోయారు విక్టరీ వెంకటేష్. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గత సంక్రాంతికి 'సైంధవ్' అనే సినిమాతో వచ్చారు. కానీ, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సీనియర్ స్టార్ హీరో సోలో సక్సెస్ కోసం అనిల్ రావిపూడితో ప్రాజెక్టును లైన్‌లో పెట్టుకున్న విషయం తెలిసిందే.

Manchu Manoj Key Role In Anil Ravipudi and Venkatesh Movie

సంక్రాంతికి వస్తున్నాం:ఒకవైపు వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి.. మరోవైపు సక్సెస్ కోసం చూస్తున్న విక్టరీ వెంకటేష్ కలిసి ఓ సినిమాను చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించబోతున్నారు. ఇప్పుడు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాకు 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్‌ను సైతం ఫైనల్ చేసుకున్నారు.

అతి త్వరలో మొదలు:విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించబోయే సినిమాకు అతి త్వరలోనే అధికారికంగా మొదలు పెట్టబోతున్నారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్‌ను జూన్ లేదా జూలై నుంచి స్టార్ట్ చేస్తారట. అంతేకాదు, వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసుకుని.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

Manchu Manoj Key Role In Anil Ravipudi and Venkatesh Movie

ఆ స్టోరీ.. ఇద్దరు లేడీస్:అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం పోలీస్ అధికారి స్టోరీతో రాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో హీరో మాజీ ప్రేయసి, భార్య మధ్య జరిగే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయని అంటున్నారు. ఈ రెండు పాత్రల్లో ఒక దాని కోసం మీనాక్షి చౌదరిని ఫైనల్ చేశారు. మరో హీరోయిన్ కోసం అనిల్ రావిపూడి వెతుకున్నాడని టాక్.

రాకింగ్ స్టార్ ఎంట్రీతో:విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీలో మరో హీరో కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అది ఎవరో కాదు.. టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టును అనిల్ రావిపూడి అతడికి వినిపించగా.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు.

Manchu Manoj Key Role In Anil Ravipudi and Venkatesh Movie

ఎలా కనిపిస్తాడంటే:వెంకటేష్ హీరోగా నటిస్తోన్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో మంచు మనోజ్ నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు కూడా తాజాగా న్యూస్ లీకైంది. అతడి పాత్ర గతంలో ఎన్నడూ చూడని వేరియేషన్స్‌తో ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఇందులో మంచు మనోజ్ ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తాడని టాక్. మొత్తానికి ఈ ప్రాజెక్టు మల్టీస్టారర్‌గా వస్తుందని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X