జూ ఎన్టీఆర్ తో కలిసి నటించనున్న మరో తెలుగు హీరో
సురేంద్ర రెడ్డి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రెడీ కానున్న చిత్రంలో మంచు మనోజ్ ఓ కీలకమైన పాత్రను పోషించనున్నాడని సమాచారం. త్వరలో ప్రారంభంకానున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. వేదంలో అల్లు అర్జున్ తో పాటు నటించటమే మనోజ్ ని ఈ ప్రాజెక్టుకు తీసుకునేలా చేసింది. ఈ చిత్రం మహేష్ తో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ కి చెయ్యాల్సిన 'మిస్టర్ పెర్ఫెక్ట్". ఈ కథను 'ఆర్య 2" చిత్రంలో మోస్ట్ పాపులర్ అయిన 'మిస్టర్ పెర్ఫెక్ట్" అనే పాటను వినగానే సురేందర్ రెడ్డి రెడీ చేసుకున్నాని చెప్తున్నాడు. కథకు తగ్గటే టైటిల్ కూడా 'మిస్టర్ పర్ఫెక్ట్" అని నిర్ణయించారు. కానీ ఇప్పుడు అంతా మారి పోయింది. మహేష్ నటించాల్సిన ఈ కథలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు..ఇక ప్రస్తుతం ఎన్టీఆర్...శక్తి, బృందావనం చిత్రాల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. అలాగే నల్లమలుపు బుజ్జి ప్రస్తుతం రానా హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











