ఆమె టాలెంట్ ని మంచు బాబు గుర్తించాడు

By Srikanya

హైదరాబాద్ : పూరి జగన్నాథ్ ..హార్ట్ ఎటాక్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన అదా శర్మకు అనుకున్నంత వేగంగా తెలుగులో అవకాశాలు రావటం లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమె హిందీలో ఓ టీవీ సీరియల్ సైతం ఒప్పుకుంది. అయితే రీసెంట్ గా ఆమెకు తెలుగులో ఓ ఆఫర్ వచ్చింది. మంచు మనోజ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలో అదా..రెండు రకాల పాత్రల్లో అంటే ఒకటి సంప్రదాయంగా, మరొకటి మోడ్రన్ గా కనిపించనుంది.

కరెంట్ తీగ చిత్రం తర్వాత షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రం ద్వారా సాగర్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రం ఆగస్టులో సెట్స్ మీదకు వెల్తోంది. దాంతో తెలుగులో ఇక ఆఫర్స్ రావేమో అనుకున్న ఆమెకు కాస్త ఊరట లభించినట్లైంది. ఈ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కునుందని చెప్తున్నారు.

Manchu Manoj to romance Adah Sharma

మనోజ్ తాజా చిత్రం విషయానికి వస్తే... ఆ తరగతి గదంతా గోల గోలగా ఉంది. మంచు మనోజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, వెన్నెల కిషోర్‌, తాగుబోతు రమేష్‌.. ఇతర విద్యార్థులందరూ తరగతి పైకప్పు ఎగిరిపోయేలా అల్లరి చేస్తున్నారు. అలాంటి వీళ్లు హఠాత్తుగా అల్లరాపేశారు. ఎదురుగా చూస్తే అందాల టీచరమ్మ. ఆ అందాన్ని చూసిన వాళ్లు నోరెళ్లబెట్టాల్సిందే మరీ. ఆ టీచరమ్మ ఎవరో కాదు సన్నీ లియోన్‌. 'కరెంట్‌ తీగ' సినిమా కోసం దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్న సన్నివేశమిది.

చిత్ర ప్రధాన తారాగణంపై హాస్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీంతోపాటు గ్రామీణ వాతావరణం నేపథ్యంలో మరికొన్ని సన్నివేశాలు చిత్రిస్తున్నారు. ''మంచు మనోజ్‌ నుంచి రాబోతున్న మరో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. నాయకనాయికల మధ్య వచ్చే సన్నివేశాలు యువతను ఆకట్టుకుంటాయి. దర్శకుడు సినిమాను వినోదాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు'' అంటోంది యూనిట్. ఈ చిత్రానికి నిర్మాత మంచు విష్ణు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X