మంచు మనోజ్ పెళ్లి భాజా?
టాలీవుడ్ లో వరుస పెళ్లి భాజాలు మ్రెగుతున్నాయి. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లు ఇప్పటికే ఓ ఇంటి వారయ్యారు. అల్లు అర్జన్ స్నేహారెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోగా, జూనియర్ ఎన్టీఆర్ తన బంధువుల అమ్మాయి లక్మి ప్రణతిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మెగా తనయుడు రామ్ చరణ్ త్వరలో తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయంఫై చిరంజీవి కూడా అధికారిక ప్రకటన చేయడంతో పాటు. మరో నెల రోజుల్లో నిశ్చితార్థం ఉంటుందని ఖరారు చేశారు కూడా.
తాజాగా...మరో టాలీవుడ్ హీరో పెళ్లి భాజ మ్రోగడానికి రంగం సిద్ధం అవుతోంది. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ త్వరలో పెళ్లికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే అన్నాలా ఏకపక్షంగా ప్రేమ వివాహం కాకుండా, ఇంట్లో వాళ్లను ఒప్పించి లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో మనోజ్ ఉన్నాడు. ప్రస్తుతం మంచు విష్ణు భార్య వెరొనికా గర్భవతిగా ఉండటంతో...ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మనోజ్ నిశ్చితార్థం, పెళ్లి సంగతులతో పాటు, మనోజ్ మనసు దోచిన అమ్మాయి ఎవరు? అనే విషయం బయటకు పొక్కే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











