»   » మంచు మనోజ్ గెటప్, క్యూట్ అంటూ హీరోయిన్

మంచు మనోజ్ గెటప్, క్యూట్ అంటూ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు విభిన్నత అంటే చాలా ఇష్టం. విభిన్నమైన వేషాల్లో, లుక్సులో అదరగొట్టడానికి ఆయన ఎప్పుడూ తాపత్రయపడుతుంటాడు.

మిస్టర్ నూకయ్య, పోటుగాడు సినిమాలు చూసిన వారికి మంచు మనోజ్ అభిరుచి ఏమిటో అర్థమై పోతుంది. తాజాగా, ఆయన నిజ జీవితంలో వినోదాత్మకమైన పాత్ర పోషించారట. క్రిస్మస్ పర్వదినం రోజు క్రిస్మస్ తాత వేషంలో అందరినీ అలరించారు. ఆ వేషంలో వదిన విరానికాతో దిగిన ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో షికారు చేస్తోంది.

 Manchu Manoj

మోహన్ బాబు కుటుంబంలో మంచు మనోజ్ చిలిపివాడిగా, అందరినీ ఆనందపరిచే వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. మంచు మనోజ్ చిత్రాన్ని చూసిన నటి ప్రణీత ఈ సాంతా ఈజ్ క్యూట్ అంటూ వ్యాఖ్యానించింది.

క్రిస్మస్ తాత వేషంలో కూడా మంచు మనోజ్ అందంగా కనిపిస్తున్నాడంటే, అందులోని మాయమర్మం ఏమిటంటూ టాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. మీడియాకు కూడా మంచు మనోజ్ వేషధారణ హాట్ టాపిక్‌గా మారింది.

English summary
The interesting bit is, actress Praneeta looked at Manchu Manoj's Santa Claus getup picture and said Santa is cute.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu