»   » మళ్లీ సీన్ లోకి 'సన్నాఫ్ పెదరాయుడు'

మళ్లీ సీన్ లోకి 'సన్నాఫ్ పెదరాయుడు'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దశరధ్ దర్శకత్వంలో రెడీ అవుతున్న శౌర్య చిత్రం ఫస్ట్ లుక్ వదిలి ఉత్సాహంగ ఉన్న మంచు మనోజ్ తన తదుపరి చిత్రానికి సిద్దమవుతున్నాడు. ఈ చిత్రం టైటిల్ సన్నాఫ్ పెద రాయుడు. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో నడుస్తుందని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి గత రెండు సంవత్సరాలుగా టాపిక్ నడుస్తోంది. ఇన్నాళ్ళకు ఫైనల్ అయిందని సమాచారం.


మోహన్‌బాబు కెరీర్‌లో కలికితురాయి లాంటి సినిమా 'పెదరాయుడు'.బాక్సాఫీస్‌ వద్ద సంచలన వసూళ్లను సాధించిన గొప చిత్రమిది. అంతేకాదు డైలాగ్‌కింగ్‌ని ఓ రేంజులో చూపించారీ చిత్రంలో. ఈ సినిమాకి సీక్వెల్‌ 'సన్నాఫ్‌ పెదరాయుడు'.కొత్త దర్శకుడు సాగర్‌ పసల దర్శకత్వం వహిస్తారని, అమెరికా షెడ్యూల్‌ మొదలవుతోందని తెలుస్తోంది.

Manchu Manoj 's Son of Pedarayudu will be launch

ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన గతంలో మిరపకాయ, శ్రీమన్నారాయణ, పైసా చిత్రాలు నిర్మించారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం దర్శక,నిర్మాతలు మిగతా సాంకేతిక నిపుణులు, నటీ నటులు ఎంపికలో బిజీగా ఉన్నారు.

నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ-''హాలీవుడ్‌లో మోషన్ పిక్చర్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వంలో శిక్షణ పొంది, హాలీవుడ్‌లో 'డార్క్ ఫీల్డ్స్' చిత్రానికి అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేసి, తెలుగులో 'కిక్' సురేందర్‌రెడ్డి వద్ద పలు చిత్రాలకు పనిచేసిన పి.సాగర్‌ని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మంచు మనోజ్‌తో నిర్మిస్తున్న ఈ 'సన్నాఫ్ పెదరాయుడు' అతి త్వరలో ప్రారంభం అవుతుంది. మనోజ్ కెరీర్‌ని కొత్త మలుపు తిప్పే వైవిధ్యమైన కథతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తాం''అన్నారు.

English summary
Manchu Manoj's next film will be directed by a new comer, Sagar Pasala titled Son of Pedarayudu. The film will be produced by Ramesh Puppala under his Yellow Flowers banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu