twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ కోసమే మనోజ్ సీన్స్ కట్ చేసారా?

    By Srikanya
    |

    వేదం చిత్రంలో మంచు మనోజ్ సీన్స్ కొన్ని ఎడిటింగ్ టేబుల్ పైనే కట్ అయ్యాయని ఫిల్మ్ సర్కిల్స్ వినపడుతోంది. దీనికి తగ్గట్లుగా ఈ చిత్రం ప్రారంభంలోనే మనోజ్..గెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాడని వేసారు. మొదట నుంచి మల్టి స్టారర్ చిత్రం అని పబ్లిసిటీ చేసి చివరకు గెస్ట్ పాత్ర అని వేయటంలో అర్ధం ఇదేనంటున్నారు. నిజానికి చిత్రం మనోజ్ పాట తోనే మొదలవుతుంది. అక్కడనుంచి అప్పుడప్పుడూ కనపడుతూ...చివరి క్లైమాక్స్ లీడ్ తీసుకుంటుంది. అయితే మనోజ్ చేస్తున్న రాక్ స్టార్ పాత్రకి ఏం సమస్య ఉందనేది మాత్రం పెద్దగా రిజిస్టర్ కాదు. అతని పెయిన్ ఏంటో..దాని నుంచి అతను బయిటపడటానికి ఏం ప్రయత్నాలు చేసాడో ఉండవు. కానీ ఈ చిత్రం స్క్రిప్టు రాసుకున్నప్పుడు మనోజ్ పాత్ర కూడా అల్లు అర్జున్ కి సమానంగా, సమాంతరంగా నడుస్తూ ఉండేదని చెప్తున్నారు. అయితే మార్కెట్ దృష్ట్యా అల్లు అర్జున్ క్రేజ్ ఉన్న స్టార్ కాబట్టి అతన్ని హైలెట్ చేయటానికి అతని మీదే పూర్తి కాన్సర్టేషన్ చేసారని అంటున్నారు.

    ఇక అల్లు అర్జున్ ని మెప్పించటం కోసం మొదట మనోజ్ పై అనుకున్న సీన్స్ ను కట్ చేసారని, ఎక్కువ ఎడిటింగ్ టేబుల్ పైనే మిగిలిపోయందని అంటున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ లో కూడా మనోజ్ తాను కేవలం గెస్ట్ పాత్రనని, తనకు ఈ చిత్రం జయాపజయాలతో సంభందంలేదన్నట్లుగా నిర్వేదంగా మాట్లాడుతున్నాడు. అదే అల్లు అర్జున్ అయితే ఈ చిత్రంకి ఫేవర్ చేసినట్లు చెప్తున్నాడు. కానీ ఓపినింగ్స్ కలెక్షన్స్ వచ్చాయంటే మాత్రం అల్లు అర్జున్ కే ననది మాత్రం సుస్పష్టం. అనుష్క కూడా అరుంధతి తర్వాత ఇంత క్రేజ్ తో వచ్చిన చిత్రం కూడా ఇదేనని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్యన మనోజ్ క్యారెక్టరే పాపం కరిగిపోయింది. మల్టి స్టారర్ సినిమా అనుకున్నప్పుడు ఇలాంటి తలనొప్పులు కామన్ అనీ, అందుకే ఎక్కువగా ఈ తరహా సినిమాలు రావటం లేదని అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X