For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ సినిమాలో విలన్‌‌గా మంచు హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగా లేదు!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలు ఈ మధ్య కాలంలో నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అంటున్నారు. కేవలం హీరోగానే కాకుండా ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎక్కువగా తాపత్రేయపడుతున్నారు. ఇక త్వరలో మంచు వారి హీరో కూడా ఎన్టీఆర్ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తారక్ సినిమా కోసం స్పెషల్ ప్లాన్ వేసినట్లు సమాచారం.

    నెగిటివ్ షేడ్స్ తో కనిపిస్తే..

    నెగిటివ్ షేడ్స్ తో కనిపిస్తే..

    సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ తో కనిపిస్తే ఆడియెన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారని రిస్క్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక మంచు మనోజ్ కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్టీఆర్ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆభిమానులు స్పెషల్ పోస్టర్స్ ని కూడా డిజైన్ చేస్తున్నారు.

     అరవింద సమేత సినిమా తరువాత

    అరవింద సమేత సినిమా తరువాత

    త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్న రెండవ సినిమా కావడంతో ఇండస్ట్రీలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే ఆ సినిమాకు "అయినను పోయి రావాలే హస్తినకు" అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఒక టాక్ కూడా వచ్చింది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసిన త్రివిక్రమ్ నటీనటులకు సెలెక్ట్ చెసుకోవడంలో బిజీగా ఉన్నాడు.

     ముఖ్యమైన పాత్ర కోసం మంచు మనోజ్..

    ముఖ్యమైన పాత్ర కోసం మంచు మనోజ్..

    ఇక ఒక ముఖ్యమైన పాత్ర కోసం మంచు మనోజ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. పూర్తిగా నెగిటివ్ రోల్ కాకుండా ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న మాస్ అండ్ స్టైలిష్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర పాత్ర ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో మనోజ్ పాత్రను కూడా త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లు సమాచారం.

    #DecadeOfVedam : Allu Arjun & Vedam Team Cherishes Memories
     ఒక పవర్ఫుల్ హీరో..

    ఒక పవర్ఫుల్ హీరో..

    ఇక సినిమాలో మనోజ్, తారక్ మధ్య భయంకరమైన యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని త్రివిక్రమ్ మాత్రం ఒక పవర్ఫుల్ హీరోను ఆ పాత్ర కోసం సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. రెగ్యులర్ విలన్స్ ని తీసుకుంటే సినిమాలో ఎమోషన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందని ఈ విధంగా మిడియామ్ హీరోలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఆ స్పెషల్ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి.

    English summary
    The heroes of the Tollywood industry are also ready to make negative rolls in the meantime. More often than not just a hero, a good actor. Soon Manchu's hero will also be seen as a powerful villain in the NTR movie. Information about Trivikram Tarak movie,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X