హీరో టార్చర్ ను తట్టుకోలేకపోతున్న హీరోయిన్...?
మంచు మనోజ్ బాబు తదుపరి చిత్రం 'మిస్టర్ నోకియా' షూటింగ్ దాదాపు పూర్తి అయింది. చలన చిత్ర పరిశ్రమలో విన్నూత్న కథాంశాలతో తనకంటూ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ఇప్పుడు ఈ చిత్రంతో దాసర బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే పలు భారీ చిత్రాలు దసరా బరిలో ఉండటంతో పోటీ మరింత అశక్తి కరంగా మారింది.
శ్రీ శైలేంద్ర మూవీస్ పథకం పై అనిల్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి ఖర్బంధ, సనాఖాన్ లు కథానాయికలుగా నటిస్తున్న విషయం విధితమే.
యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు.త్వరలోనే చిత్రం ఆడియో విడుదల అవుతుందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ సమయంలో మనోజ్, కృతిని టార్చర్ పెట్టాడట. షూటింగ్ సమయంలో మనోజ్ దర్శకుడు చెప్పే విధంగా చేయకుండా, తన సొంత స్టైల్లో చేస్తూ కథను కథావితలం చేసేస్తున్నాడని సమాచారం. అదే విధంగా ఈ చిత్రంలోని హీరోయిన్ కృతి పాత్రను కూడా తనకు నచ్చిన విధంగా మలుచుకుంటు, కృతికి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడని సమాచారం.
మనోజ్ టార్చర్ ని కృతి భరించలేకపోతుందట. ఇటీవలే పవన్ లాంటి అగ్ర హీరోలతో నటించిన 'తీన్ మార్" చిత్రంలో కూడా ఇలాంటి టార్చర్ అనుభవించలేదు. కానీ ఈ హీరోతోనే ఇలాంటి టార్చర్ అనుభవిస్తున్నట్టు సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











