బాలయ్య కూతురుతో మంచు మనోజ్ పెళ్లి?
నందమూరి ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీకి మధ్య చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినీ రంగంలో ఎన్టీ రామారావుతో చాలా సన్నిహితంగా ఉండే మోహన్ బాబు, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కూడా చాలా కాలం పాటు పార్టీలో చురుకుగా పని చేశారు. అదే సమయంలో వైఎస్ఆర్ ఫ్యామిలితోనూ మంచి సంబంధాలు ఏర్పుకున్నారాయన. మొత్తానికి వైఎస్ఆర్ సోదరుడితో వియ్యం కలుపుకున్నారు.
తాజాగా నందమూరి ఫ్యామిలీతో వియ్యమొందేందుకు మోహన్ బాబు పావులు కదుపుతున్నట్లు సమాచారం. బాలయ్య చిన్న కూతురు తేజస్విని, తన చిన్న కొడుకు మనోజ్ కు ఇచ్చి పెళ్లి చేయాలని అడిగేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తూంది. మనోజ్ ప్రేమ, పెళ్లి అంటూ....తనకు ఇష్టం లేని పనులు చేస్తున్న నేపథ్యంలో ఎంత త్వరగా మనోజ్ ముక్కుకు తాడేస్తే తప్ప లాభం లేదనేది మోహన్ బాబు ఆలోచయన అని ఫిల్మ్ నగర్ టాక్.
తేజస్విని ప్రస్తుతం బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. ఇంత కాలం ప్రేమ దోమ అంటూ టింగరి వేషాలు వేసినా... మనోజ్ చివరకు కూడా నాన్న చూసిన సంబంధానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే తేజస్విని చదువు పూర్తవగానే నందమూరి-మంచు వారి ఇళ్లలో పెళ్లి భాజాలు మ్రోగుతాయని అంటున్నారు. మరి ఇరు కుటుంబాల వారి నుంచి అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిండచం లేదు.


Click it and Unblock the Notifications











