మంచు వారి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ.. కలెక్షన్ కింగ్ కొత్త ప్లాన్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా, మల్టీస్టారర్ కాన్సెప్ట్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా బిగెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్టులు తెరపైకి వస్తున్నాయి. ఇకపోతే మంచు ఫ్యామిలీ నుంచి కూడా బిగ్ బడ్జెట్ సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొడితే మంచి బాక్సాఫీస్ హిట్టు కొట్టాలనే విధంగా ఆ ఫ్యామిలీ ప్రస్తుతం గట్టిగానే కష్టపడుతొంది.

గతంలో మాదిరిగా..
మోహన్ బాబు స్పెషల్ పాత్రలతో మెప్పిస్తున్నప్పటికి గతంలో మాదిరిగా సోలో సక్సెస్ లు అయితే అందుకోలేదు. గాయత్రి సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతో సక్సెస్ అందుకోవాలని మోహన్ బాబు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ సినిమా పెట్టిన బడ్జెట్ లో కనీసం సగం కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది.

మంచు వారి మల్టీస్టారర్..
ఇక ఆయన వారసులు మంచు విష్ణు, మనోజ్ కూడా హీరోగా సరైన స్థాయిలో నిలదొక్కుకోలేకపోతున్నారు. ఇక నెక్స్ట్ ఈ స్టార్ యాక్టర్స్ కోసం మోహన్ బాబు ఒక ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. తన కొడుకులతోనే కలిసి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారట మోహన్ బాబు. సొంత ప్రొడక్షన్ లోనే వారి మార్కెట్ కి మించిన బడ్జెట్ ని పెట్టబోతున్నారట.

సక్సెస్ కోసం..
గతంలోనే మోహన్ బాబు తనయులతో కలిసి మోహన్ బాబు పాండవులు పాండవులు తుమ్మెద అనే సినిమా చేశాడు. ఆ సినిమా కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక మళ్ళీ మంచు ఫ్యామిలీ కలిసి నటించలేదు. అయితే ఈ సారి ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నారట.
Recommended Video

మంచు వారి మంచి సినిమా..
ఈ మధ్య కాలంలో మంచి కుటుంబ కథ చిత్రాలు పెద్దగా వచ్చింది లేదు. ఎలాగైనా నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఒక పండగ సీజన్ కి మంచు వారి నుంచి ఒక మంచి సినిమా విడుదల చేయాలని మోహన్ బాబు ప్లాన్ చేసుకుంటున్నారట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మోహన్ బాబు రాబోయే రోజుల్లో తన నుంచి నెవర్ బోఫోర్ అనే తరహాలో సినిమాలు రానున్నట్లు చెప్పారు. మరి ఆ సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











