వైఎస్ జగన్‌పై ఫోకస్ పెట్టిన మంచు విష్ణు?

By Bojja Kumar

అప్పట్లో మోహన్ బాబు హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'అసెంబ్లీ రౌడీ' చిత్రం రీమేక్‌ ద్వారా మంచు విష్ణు ప్రేక్షకుల ముందుకు రావడానికి ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విష్ణు పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని పోలి ఉంటుందని, ప్రస్తుతం రాజకీయాల ప్రస్తావిస్తూ ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది.

విష్ణు జగన్ నేపథ్యాన్ని ఎంచుకోవడానికి ఓ ప్రత్యేకమైన కారణ ఉందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం స్టేట్‌లో మంచి జోరు మీదన ఉన్న నాయకుడు జగన్. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఢీ కొంటూ ఓ వైపు సక్సెస్ ఫుల్‌గా పార్టీ నడిపిస్తూ...మరో వైపు అక్రమ ఆస్తుల కేసులో జైలు ఊచలు లెక్క పెడుతున్నాడు. జగన్ జైల్లో ఉన్నప్పటికీ ప్రజల ఫాలోయింగ్ పెరిగిందే తప్ప తరగలేదు.

ఈ నేపథ్యంలో జగన్ అంశాన్ని తన సినిమాలో ఫోకస్ చేయడం ద్వారా సినిమాపై అంచనాలు పెరుగుతాయని, ప్లాపుల బాటలో ఉన్న తనకు హిట్ దక్కే అవకాశం ఉందని, జగన్‌ను అభిమానుస్తున్న వాళ్లంతా వచ్చి సినిమా చూసినా సినిమా హిట్టయిపోతుందనే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇక హీరోయిన్ గా తాప్సీ ని ఎంపిక చేయనున్నారని సమాచారం.

ఆ మధ్య వరుస ప్లాపుల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న విష్ణు త్వరలో 'దేనికైనా రెడీ' చిత్రం ద్వారా ప్రక్షకుల ముందుకు రాబోతున్నాడు. జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీ నిర్మిస్తారు. కోన వెంకట్ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నాగేశ్వర రెడ్డి తెరకెక్కించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X