Kannappa Rights : మంచు విష్ణు రికార్డ్.. భారీ ధరకు కన్నప్ప శాటిలైట్ రైట్స్.. ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు తాజా చిత్రం కన్నప్ప. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్ గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 27న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలోనూ గ్రాండ్గా విడుదలైంది. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి భారీ తారాగణం నటించడంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వస్తువులను రాబడుతుండడం విశేషం. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ఎంతకు అమ్ముడుపోయాయి అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.
కన్నప్ప చిత్రానికి భారీ బడ్జెట్..
కన్నప్ప చిత్రానికి నిర్మాతగా టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించడం విశేషం. AVA ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీస్ బ్యానర్లలో సంయుక్తంగా నిర్మించారు. భారీ తారాగణం, టాప్ టెక్నీషియనులు పనిచేయడంతో సినిమాకు 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ఖర్చయిందని మేకర్స్ తెలిపారు. ఇక ఆ తర్వాత మాత్రం రూ.120 కోట్ల వరకు ఖర్చైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించడం గమనార్హం.

కన్నప్ప చిత్రం రైట్స్ కు భారీ ధర..
కన్నప్ప చిత్రానికి సంబంధించిన హిందీ శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హిందీలో కన్నప్ప చిత్రం థియేట్రికల్ రన్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో హిందీ శాటిలైట్ రైట్స్ 20 కోట్ల రూపాయలకు ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ కంపెనీ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇక మిగిలిన భాషల్లో శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోవాల్సి ఉంది. ఇక మంచు విష్ణు కెరీయర్ లో అత్యధిక ధరకు శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోవడం విశేషం.
కన్నప్ప ఓటీటీ రైట్స్..
మంచు విష్ణు ఇప్పటికే కన్నప్ప చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ విషయంలో కీలకమైన తీసుకున్నారు. సినిమా టాక్ బాగుంటే భారీ డీల్ కు అమ్ముతామని చెప్పారు. ఇక ప్రస్తుతం కన్నప్ప చిత్రానికి మంచి టాక్ దక్కడం, ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ అవుతుండటంతో సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడు పోతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది. ధర ఎంత అనేది తెలియాల్సి ఉంది.
కన్నప్న చిత్రం విశేషాలు..
మంచు విష్ణు కన్నప్ప చిత్రంతో కంబ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రానికి హిందీ మహా భారతం సీరియల్ డైరెక్టర్ దర్శకత్వం వహించడం విశేషం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళం స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. సినిమాలో మంచు విష్ణు నటన, స్టార్స్ కీలక పాత్రలు, విజువల్స్, సౌండ్ అదిరిపోవడం విశేషం. ఇప్పటి వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది.


Click it and Unblock the Notifications











