మంచు విష్ణు,రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు '13'
హైదరాబాద్ : మంచు ఫ్యామిలీతో కలిసి రౌడీ చిత్రం తెరకెక్కించిన వర్మ తన తదుపరి చిత్రాన్ని సైతం మంచు విష్ణుతోనే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ టెన్షన్...టెన్షన్ అని ప్రచారంలోకి వచ్చింది. అయితే అది కాదు అని వర్మ కొట్టిపారేసారు. అయితే ఇప్పుడు తాజాగా ...ఆ చిత్రానికి '13' అనే టైటిల్ ని ఖరారు చేసారని అంతర్గత వర్గాల సమాచారం. ఈ చిత్రంలో విష్ణు ..పోలీస్ గా కనిపించనున్నారు. చిత్రంలో ఐదుకి పైగానే ఫిమేల్ రోల్స్ ఉంటాయని తెలుస్తోంది.
'13' అని టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటంటే... విష్ణుకి ఇది 13 వ చిత్రం కావటం, 13 అనేది మిస్టీరియస్ సంఖ్య కావటం,తమ కథ కూడా క్రైమ్ తో నడిచే మిస్టరీ తరహా థ్రిల్లర్ చిత్రం కావటం,చిత్రంలోనూ 13 మర్డర్స్ ఉండటంతో అదే టైటిల్ ని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది. అలాగే అంకెతో టైటిల్ కావటంతో జనాల్లోకి బాగా వెళ్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా ఈ విషయమై ఏ విధమైన సమాచారం లేదు.

వర్మ మాట్లాడుతూ.... విష్ణుతో ఇంకో సినిమా చేస్తున్నాను. కానీ దాని పేరు టెన్షన్ కాదు.. అటెన్షన్ కాదు. సినిమా పూర్తయ్యాక పేరు చెప్తాను. మరో కథ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాను అని చెప్పారు. మోహన్‌బాబు... రామ్‌గోపాల్ వర్మ... ,మంచు విష్ణు కలయికలో వస్తున్న 'రౌడీ' చిత్రం ఈనెల 4న విడుదలవుతోంది.
'రౌడీ' కథ గురించి చెప్పాలంటే... రాయలసీమ ప్రాంతంలో అందరూ నాయకుడిలా కొలిచే ఓ అన్న కథ ఇది. ఫ్యాక్షనిజం పూర్వాపరాల్ని చూపిస్తాం. ప్రజల కోసం చట్టాన్ని చేతిలోకి తీసుకొనే ఓ మంచి రౌడీ కథ. సినిమా చూస్తే పూర్తి స్పష్టత వస్తుంది. ఇదేదో సినిమా నుంచి స్ఫూర్తి పొంది తీసినదో.. కాపీయో కాదు. పూర్తిస్థాయి ఫిక్షన్ ఇది.


Click it and Unblock the Notifications











