నిర్మాతగా మారుతున్న మంచు విష్ణు
వెండి తెరపై వెలుగు వెలిగిన స్టార్స్ అంతా తమ వారసులను తెరపైకి వదలడం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. అలా వచ్చిన వారిలో కొందరు సక్సెస్ అయితే, మరికొందరు ప్రేక్షకుల నిరాదరణకు గురై తెర మరుగయి పోతున్నారు. ఇలా వచ్చిన వారిలో మోహన్ బాబు తనయులు విష్ణు, మనోజ్ కూడా ఉన్నారు. విష్ణు విషయానికొస్తే 'ఢీ" సినిమా తప్ప విష్ణు కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేవని చెప్పాలి. ఆ సినిమా తర్వాత విష్ణు నటించి పలు సినిమాలు బాక్సీఫీసు వద్ద నష్టాలనే మిగిల్చాయి. తాజాగా మరో సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓ ఫ్రోగ్రాం ద్వారా హీరోయిన్ వెతికే పనిలో ఉన్నాడు. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే మొదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అసలు మొదలు కాకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.
హీరోగా నటించడం వల్ల పెద్దగా వర్కవుట్ కాదనుకుంటున్నాడో? ఏమో గానీ నిర్మాత అవతారం ఎత్తాడు. ఆయన వరుస చూస్తుంటే తెరపై కనిపించడానికి ముఖం చాటేస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం తన తండ్రి మోహన్ బాబు పెట్టి టైటిల్ రోల్ లో పెట్టి సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తెలుగుతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ నటించన్నట్లు తెలుస్తూంది.


Click it and Unblock the Notifications











