మోహన్ బాబు కోడలిగా కాకుండా తనకంటూ ఓ సోంత ఇమేజి కోసమే
మంచు ఫ్యామిలీలో విష్ణు భార్య వెరోనికా తప్ప అంతా సెలబ్రిటీలే. నిన్న మొన్నటి వరకు మంచు విష్ణు భార్యగానో, మోహన్ బాబు కోడలిగానో తెలిసినటువంటి వెరోనికా ఇప్పుడు ట్విట్టర్‌లో దాదాపు పదివేల పైచిలుకు ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడైనా భర్తతో కలసి ఫంక్షన్లుకు హాజరవ్వడం తప్పించి పెద్దగా కనిపించని వెరోనికాకి పది వేల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే మాటలు కాదంటున్నారు ఫిలిం నగర్ సినిమా విశ్లేషకులు.
సినిమా రంగంతో డైరెక్ట్ కనెక్షన్ లేకుండా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే తాను నిర్మించినటువంటి కొత్త సినిమా వస్తాడు నారాజు సినిమా హిట్టయితే నిర్మాత హోదాలో ఇంటర్యూలు గట్రా ఇస్తే ఇంకెంత పాపులారిటీ వస్తుందేమోనని అమె సన్నిహితులు వెల్లడించినట్లు సమాచారం. ఇకపోతే మంచు విష్ణు హీరోగా వస్తాడు నారాజు సినిమా ఈనెల 11న విడుదల కావడానికి సిద్దంగా ఉంది. 'వస్తాడు నా రాజు' సినిమా హైదరాబాదులో సెన్సార్ పూర్తి చేసుకోని క్లీన్ U సర్టిఫికేట్ లభించిన విషయం తెలిసిందే. ఇక 'వస్తాడు నా రాజు' సినిమా నిర్మించడానికి కారణం మోహన్ బాబు కోడలిగా కాకుండా తనకంటూ ఓ సోంత ఇమేజి కోసమేనని ప్రయత్నిస్తున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











