»   » గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం మహేష్ కి హ్యాండిచ్చి రామ్ చరణ్ తీసుకొంటాడా..!?

గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం మహేష్ కి హ్యాండిచ్చి రామ్ చరణ్ తీసుకొంటాడా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు, మణిరత్నం కాంబినేషన్ లో రూపొందాల్సిన 'పొన్నియన్ సెల్వం" అర్థాంతరంగా ఆగిపోవడానికి బడ్జెట్ ముఖ్య కారణమని తెల్సిందే. భారీ తారాగణంతో మొదలవ్వాల్సిన ఈ చిత్రానికి సగానికి పైగా నిర్మాణ వ్యయం, ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ రూపంలోనే హరించుకుపోయేది. కానీ మణిరత్నం చొరవతో కొందరు నటీనటులు తమ పారితోషికాన్ని తగ్గించుకునేందుకు సిద్దపడగా, కాస్ట్ కంట్రోల్ లో భాగంగా పది కోట్ల వరకూ పలుకుతున్న మహేష్ బాబుకు బదులుగా చౌకగా దొరుకుతానంటున్నరామ్ చరణ్ వైపై మణిరత్నం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని సమాచారం.

వివరాల్లోకి వెళితే తమిళనాడులో బహుళ ప్రాచుర్యాన్ని పొందిన చారిత్రాత్మక తమిళ 'పొన్నియన్ సెల్వన్' అనే నవలను చలన చిత్రంగా మలచటానికి ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించబోయే ఈ సినిమాలో హీరోగా ప్రిన్స్ మహేష్ బాబుని తీసుకోవాలనుకున్నాడు. కానీ ఫైనాన్సియర్లు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు మణిరత్నం.

ఇటీవల 'మగధీర' సినిమాని తమిళంలోకి 'మా వీరన్' పేరుతో విడుదలై కలెక్షన్స్ బాగానే రాబడుతోంది, దాంతో ఆ సినిమాలో రామ్ చరణ్ నటనకు ముగ్ధుడై, ప్రిన్స్ మహేష్ బాబుకు బదులు రామ్ చరణ్ ని హీరోగా తీసుకోవాలని అనుకుంటున్నాడట మణిరత్నం. తమిళనాట గుర్తింపు సంపాదించిన రామ్ చరణ్ ని పెట్టుకుంటే ఇటు మనీ సేవ్ అవుతుంది, అటు అదే రేంజ్ హీరోనే అదనంగా తోడవుతుంటే ఏ దర్శకుడు మాత్రం వదులుకుంటాడు..మరి రామ్ చరణ్ హీరో అయితే మాత్రం వందకోట్లకు ప్యాగా ఖర్చయ్యే ఈ సినిమాకు ఫైనాన్సియర్లు దొరుకుతారా అన్నది అనుమానమే. అయినా రామ్ చరణ్ ఈ సినిమాలో నటించటానికి అంగీకరిస్తాడో లేదో కాలమే చెప్పాలి. ప్రస్తుతానికైతే నిర్మాతలను వెతుక్కుంటున్న మణిరత్నం భవిష్యత్తులో రామ్ చరణ్ ఎంచుకుంటే ఇది మహేష్ రెమ్యూనరేషన్ సంబందించిన స్వయంకృతాపరాధమే అవుతుంది. మహేష్ బాబుకే రాని ఫైనాన్సియర్లు రామ్ చరణ్ కి వస్తారంటారా...? ఏమో....! అనుమానమే....!

English summary
They were many speculations milling around maverick director’s Mani Ratnam magnum opus Ponniyin Selvan. Latest buzz we hear is that Mani Ratnam is in plans of replacing Mahesh Babu with Ram Charan Teja (Maaveeran Hero). This is really a shocking update but an official confirmation is awaited.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu