చిరంజీవి సినిమా నుంచి అతడు ఔట్: దేవీనే దింపాలని డిసైడ్ అయిన మెగాస్టార్

రీఎంట్రీలో ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి వచ్చిన ఆయన.. తీసుకున్న గ్యాప్‌ను వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి పూడ్చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్న చిరు.. దీని తర్వాత 'లూసీఫర్' రీమేక్‌లో నటించనున్నారు. అనంతరం మెహర్ రమేశ్ సినిమాతో పాటు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో ఓ మూవీ చేస్తారు. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ లీకైంది.

పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తోంది.. సాక్షి అగర్వాల్ రచ్చ

వరుస విజయాలతో దూసుకుపోతోన్న దర్శకుడు బాబీ.. లాక్‌డౌన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవికి ఓ లైన్ వినిపించాడు. అది ఆయనకు నచ్చడంతో పూర్తి కథను కూడా సిద్ధం చేసేశాడు. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక, ఈ సినిమా కోసం మెలోడీ కింగ్ మణిశర్మను సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఆయనను ఈ మూవీ నుంచి తప్పించారట. అంతేకాదు, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్‌ను తీసుకున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Mani Sharma Out and Devi Sri Prasad in fro Chiranjeevi Bobby Movie

ప్రస్తుతం మణిశర్మ.. చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య'కు పని చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఆయన కంపోజ్ చేసిన ట్యూన్స్ విషయంలో మెగాస్టార్ సంతృప్తిగా లేరని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయనను బాబీ సినిమా నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నట్లు ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో 'ఉప్పెన'తో మరోసారి తన మార్క్ చూపించిన డీఎస్పీని తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచాం. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'శంకర్‌దాదా ఎంబీబీఎస్', 'శంకర్‌దాదా జిందాబాద్', 'ఖైదీ నెంబర్ 150' వంటి చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X