మణిశర్మ కుమారుడు హీరోగా చిత్రం..డైరక్టర్ ఎవరంటే
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్ హీరోగా ఓ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. లక్ష్యం, ఆది, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి చిత్రాలు నిర్మించిన నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం ద్వారా వేమారెడ్డి అనే దర్శకుడు పరిచయంకాబోతున్నారు. గతంలో త్రివిక్రమ్ వద్ద అసెస్టెంట్ గా పనిచేసిన వేమారెడ్డి చెప్పిన కథ విని ఈ చిత్రాన్ని వెంటనే ఓకే చేసినట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్టు అక్టోబర్ లో లాంచ్ కానుంది. తన కుమారుడు చిత్రానికి బెస్ట్ ట్యూన్స్ మణిశర్మ ఇప్పటికే రెడీ చేసుకుని ఉంటారు. హీరోయిన్ ఎంపిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే మిగతా సాంకేతిక వర్గం కూడా ఫైనలైజ్ కావాల్సి ఉంది. ఓ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి మొదట బాణం డైరక్టర్ దంతలూరి చైతన్య పేరు వినిపించింది. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు.


Click it and Unblock the Notifications











