విడాకుల విషయంపై వివరణ ఇచ్చిన మనీషా కొయరాలా
రీసెంట్ గా మనీషా కొయరాలా తాను విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు పేస్ బుక్ లో రాసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పెళ్లై నాలుగు నెలలు కూడా కాకుండా ఆమె ఇలాంటి వ్యాఖ్య చేయటంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు తాను కేవలం కోపంలో రాసిన సంగతేనని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని శెలవిస్తోంది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ..తన భర్తతో తాను చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్పింది. అలాగే ఫేస్ బుక్ లో ఆ పోస్ట్‌ను రాసేటప్పుడు నేను చాలా కోపంగా ఉన్నాను అని తెలిపింది. అలాగే కొన్నిసార్లు నేను చిన్న చిన్న విషయాలకే స్పందిస్తుంటాను అని వివరణ ఇచ్చుకుంది. తన కంటే ఐదు సంవత్సరాలు చిన్నవాడైన నేపాలీ పారిశ్రామికవేత్త సమ్రాట్ దహాల్ తో మూడు రోజుల పాటు ఘనంగా చేసుకున్న వివాహాన్ని మనీషా ఇప్పటికే విచ్ఛినం చేసుకుందనే వార్తలు సోషల్ నెట్ వర్క్ లో పాపులర్ అయ్యాయి. అయితే ఈ విషయమై మనీషా కుటుంబ సభ్యులు సైతం మంగళవారం ఈ వార్తలను ఖండించారు. ఆమె వైవాహిక జీవితం చాలా అధ్బుతంగా సాగుతోందని అన్నారు. ప్రస్తుతం మనీషా కొయరాల....హన్సిక, ధనుష్ కాంబినేషన్లో రూపొందుతున్న మాప్పిళ్ళై చిత్రం రీమేక్ లో హన్సికకు తల్లిగా నటిస్తోంది. అలాగే నయనతార తల్లిగా ఎలక్ట్రా అనే మళయాళ చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











