కందిరీగ పోరగాడికి మహేష్ బాబు సిస్టర్ చేయూత
హీరో రామ్, ప్రఖ్యాత డైరెక్టర్ గౌతం మీనన్ ప్రాజెక్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. రామ్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని కొందరంటుంటే, కెరియర్‌లో పెద్ద అవకాశాన్ని వదులుకున్నాడు అంటూ మరికొందరు అంటున్నారు. రామ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటంటే.....రామ్ హీరోగా గౌతం ఓ ప్రేమకథను మూడు భాషల్లో రూపొందించాలని అనుకున్నాడు. అయితే రామ్ తో మాత్రం రెండు భాషల్లో మాత్రమే అని చెప్పి, అంత మేరకు రెమ్యూనరేషన్ తోనే అగ్రిమెంట్ రాయించుకున్నాడు. పని మాత్రం మూడు బాషలకు చేయించుకుంటున్నాడు. ఈ వ్యవహారం నచ్చని రామ్ షూటింగ్ ప్రారంభమైన 10 రోజుల తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి తప్పించుకున్నాడు.
పెద్ద దర్శకుడి సినిమా నుంచి తప్పుకోవడంతో అందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న రామ్ కు...నువ్వు చేసింది కరెక్టే , ఎవరి మాటలను పట్టించుకోకు అంటూ ఓదార్చడం మొదలు పెట్టిందట సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల. ఉన్నట్టుండి రామ్ పై మంజులకు ఇంత ప్రేమ పుట్టడానికి కారణమూ లేక పోలేదు. గతంలో గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన ' ఏ మాయ చేశావె" సినిమాకు మంజుల నిర్మాత. అప్పడు కూడా గౌతం మంజులతో ఇలాంటి ట్రిక్సే ప్లే చేశాడట. సినిమాకు ఇంత ఖర్చవుతుందని భారీగా డబ్బులు లాగి, అంతకంటే తక్కువ మొత్తంలోనే సినిమా పూర్తి చేసిన మిగిలి మొత్తాన్ని తన జేబులోకి తోసేసుకున్నాడట. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి మంజుల గౌతంపై కోపంగానే ఉంది. శత్రువుకు శత్రువు మిత్రువు అన్న చందంగా..గౌతం మీనన్ వల్ల దెబ్బతిన్న ఈ ఇద్దరు ఇప్పడు స్నేహితులయ్యారని ఫిల్మ్ నగర్ టాక్.


Click it and Unblock the Notifications











