భార్యపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా డైరెక్టర్ ప్లాన్.. ‘మన్మథుడు 2’పై షాకింగ్ డెసిషన్
Recommended Video
అక్కినేని నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్లకు విశేష స్పందన వచ్చింది. అదే సమయంలో వివాదాలు కూడా చెలరేగాయి.

లిప్‌లాక్‌లు- వివాదం
‘మన్మథుడు 2' టీజర్ విడుదలైన సమయంలో పెద్ద వివాదమే చెలరేగింది. ఇందులో లిప్ లాక్‌లు ఉండడంతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్, ఆయన భార్య చిన్మయిని టార్గెట్ చేసి చాలా మంది ట్రోల్ చేశారు. దీనికి కారణం గతంలో చిన్మయి సినిమాల్లో బోల్డు సీన్లకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడమే. దీంతో చాలా మంది ఈ టీజర్‌ను ప్రస్తావిస్తూ చిన్మయిని ట్రోల్ చేశారు.

అవంతిక టీజర్‌తో వివాదం
‘మన్మథుడు 2' టీజర్‌లో రకుల్‌ను చూపించకపోయే సరికి అభిమానులు నిరాశ చెందారు. ఈ విషయం దర్శకుడి వరకు వెళ్లడంతో ఆమె కోసం స్పెషల్‌గా ఓ టీజర్ రెడీ చేశారు. ఇందులో రకుల్ కొంత బోల్డుగా కనిపించింది. ‘ఇప్పటి వరకు U సర్టిఫికెట్ ట్రై చేశాను. ఇకపై A సర్టిఫికెట్ చూపిస్తా' అంటూ రకుల్ నాగ్‌తో చెప్పే డైలాగ్‌తో పాటు రకుల్ సిగరెట్ తాగి పొగ వదిలే సీన్‌లో కనపడింది.

ఇక్కడా ఆమెనే టార్గెట్
ఒకవైపు రాహుల్ సినిమాలో బోల్డు కంటెంట్ పెడుతుంటే, మరోవైపు చిన్మయి మాత్రం దానికి వ్యతిరేకంగా మాట్లాడడం చర్చనీయాంశం అయింది. దీంతో చాలా మంది ‘‘మీరు చాలా నీతులు చెబుతున్నారు. మరి మీ భర్తగారు తన సినిమాలో చూపిస్తున్నది ఏమిటి? ‘మన్మధుడు 2' టీజర్లో రకుల్ స్మోకింగ్ సీన్ చూపడం ద్వారా అమ్మాయిలు పొగతాగాలని ఎంకరేజ్ చేస్తున్నారా? హీరోయిన్ బటన్ విప్పడం, ప్లర్టింగ్ చేయడం చూపిండం ద్వారా ఈ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు?'' అంటూ చిన్మయి మీద విరుచుకుపడ్డారు.

వాటిని కట్ చేయబోతున్నారట
రెండు టీజర్లలో చూపించిన బోల్డు కంటెంట్ మాత్రమే కాకుండా ఈ సినిమా కోసం అలాంటివే చాలా సన్నివేశాలు సిద్ధం చేశారట. అయితే, ప్రస్తుతం బయట వివాదం నడుస్తుండడంతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ వాటిలో చాలా సీన్లను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

‘మన్మథుడు 2' గురించి..
గతంలో నాగార్జున్, సోనాలి బింద్రె, అన్షు కాంబినేషన్‌లో వచ్చిన ‘మన్మథుడు'కు కొనసాగింపుగా ఈ సినిమా వస్తోంది. వయసు దాటిపోయాక పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తికి.. ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి..? దీంతో అతడు ఏ విధంగా మారాడు..? అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











