For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు మనోజ్ సరసన అమలా పాల్

    By Srikanya
    |
    హైదరాబాద్ : బెజవాడ,నాయక్, ఇద్దరమ్మాయిలతో, అన్న చిత్రాలతో తెలుగువారికి బాగా పరిచయమైన మళయాళ కుట్టి అమలా పాల్. ఆమె త్వరలో మంచు మనోజ్ సరసన నటించే అవకాసం ఉందని సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వీడు తేడా దర్శకుడు తో తెరకెక్కనున్న చిత్రంలో ఆమెకు హీరోయిన్ గా ఆఫర్ చేసారని చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ఆమెకు కోటి రూపాయల వరకూ ఇవ్వటానికి సిద్దపడ్డారని వినికిడి.

    ఇక ఈ చిత్రం నితిన్ ఇటీవల వదులుకున్న చిత్రం అని తెలుస్తోంది. నిఖిల్ తో 'వీడు తేడా' అనే సినిమా తీసిన చిన్ని కృష్ణ మాలి ప్రయత్నాలలో భాగంగా ఒక సబ్జెక్ట్ నితిన్ కి చెప్పగా నితిన్ కూడా అంగీకరించాడు. అయితే ఏమయిందో తెలియదు కానీ సినిమా ప్రారంభం కాకుండానే ఆగిపోయింది. ఇదే సినిమాని మంచు మనోజ్ చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మంచు మనోజ్ ప్రస్తుతం పోటుగాడు చిత్రం చేస్తున్నాడు.

    ' సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగు...సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగు... అంటూ 'కొత్త బంగారులోకం' చిత్రంలో, 'ఇట్స్ నాట్ ఎ వాటర్ డ్రింకు స్లోలీ.. అంటూ 'అదుర్స్' చిత్రంలో తనదైన డైలాగ్ డెలివరీతో నటుడిగా ఆకట్టుకున్న చిన్నికృష్ణ 'వీడు తేడా' చిత్రంతో దర్శకుడిగా మారాడు. నిఖిల్ పూజా బోస్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కళ్యాణ్ చక్రవర్తి, సందీప్ నిర్మించారు. ఆ మద్యన విడుదలైన ఈ చిత్రం దర్శకుడుగా మంచి పేరునే తెచ్చిపెట్టింది.

    చిన్ని కృష్ణ మాట్లాడుతూ... సినిమా అంటే చిన్నతనం నుంచి వల్లమాలిన అభిమానం. ఆ అభిమానం వల్లే వైజాగ్‌లో స్టేజ్ నాటకాలకు కథలు అందించే వాణ్ణి. సినిమా అంటూ తీస్తే జంధ్యాల, ఇ.వి.వి. సత్యనారాయణ తరహాలో ఎలాంటి వల్గారిటీ లేకుండా కామెడీ ఎంటర్‌టైనర్ చేయాలని వుండేది. అందుకే నిఖిల్‌తో ఫుల్‌పూంత్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'వీడు తేడా' చిత్రాన్ని రూపొందించాను. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.

    English summary
    
 Amala Paul is all set to romance Manchu Manoj. It is known that Bellamkonda Suresh is producing the film with Manoj. Buzz is filmmakers shortlisted Amala Paul for the lead role. Buzz is Amala is getting Rs 1 crs as remuneration. Sources say that Amala didnot ask anything but Bellamkonda offered this pay check without her asking. Chinni Krishna of Veedu Teda is directing the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X