ఆ వారసుడితో బాలకృష్ణ మల్టీస్టారర్: మాస్ డైరెక్టర్ సూపర్ ప్లాన్.. అప్పుడాయన.. ఇప్పుడీ యంగ్ హీరో
తెలుగు సినీ ఇండస్ట్రీలో జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. చాలా మందికి పని కల్పించడం కోసం సినిమాలు ఒప్పుకున్న చరిత్ర ఆయన సొంతం. ఈ కారణంగానే కెరీర్‌లో చాలా పరాజయాలను చవి చూశారు. ఇక, ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ఓ సినిమాను చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో కీలక పాత్రను పోషిస్తున్నట్లు ఓ వార్త లీకైంది. ఆ వివరాలు మీకోసం!

వరుసగా మూడు ఫ్లాపులతో ఇబ్బందులు
ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేసేంత వేగంగా పని చేస్తుంటారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాగే 2019లో ఆయన ఏకంగా మూడు సినిమాలు (యన్.టి.ఆర్ కథానాయకుడు, యన్.టి.ఆర్ మహానాయకుడు, రూలర్) చేశాడాయన. ఇవన్నీ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవలేదు.
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ఫ్యాన్స్ హంగామా... ఆకట్టుకొన్న డ్రమ్మర్ శివమణి

హిట్ కొట్టేందుకు అచ్చొచ్చిన దర్శకుడితో
చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు నందమూరి హీరో బాలయ్య. దీంతో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నారాయన. ఇందుకోసం తనకు అచ్చొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో మరోసారి జత కట్టారు. BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

తొలిసారి అలాంటి పాత్రలో.. కెరీర్‌లో ఇలా
రెండు భారీ హిట్లు 'సింహా', 'లెజెండ్' తర్వాత రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీని బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అంతేకాదు, ఇందులో ఆయన రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి అఘోరా పాత్ర కూడా ఉంది. గతంలో తెలుగులో ఏ హీరో కూడా ఇలాంటి పాత్రను చేయకపోవడం గమనార్హం.

అన్నీ భారీగానే ప్లాన్... అలా ముందుకు
కచ్చితంగా హిట్ కావాల్సిన సమయంలో బాలయ్య - బోయపాటి కలిశారు. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. కాస్టింగ్ నుంచి బడ్జెట్ వరకూ అంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఇక, టీజర్ విడుదలైన తర్వాత ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరిగింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో షూట్ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రయోగాలూ చేస్తున్నారు.

ఆ సినీ వారసుడితో బాలయ్య మల్టీస్టారర్
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న BB3లో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లు కాగా.. శ్రీకాంత్, శరత్ కుమార్ విలన్లుగా నటిస్తున్నారు. దీనికి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇంత మంది ప్రముఖులు ఉన్నా.. ఈ సినిమాకు మరింత గ్లామర్ తెచ్చేందుకు ఓ సినీ వారసుడిని ఈ మూవీలో భాగం చేస్తున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

మాస్ డైరెక్టర్ సూపర్ ప్లాన్.. సెకెండాఫ్‌లో
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు కుమారుడు మనోజ్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నాడట. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఈ ముఖ్యమైన రోల్ ప్రీ క్లైమాక్స్ వరకూ ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య సూచన మేరకు మనోజ్‌తో బోయపాటి సంప్రదిపులు జరపగా.. అతడు వెంటనే ఓకే చెప్పాడని తెలిసింది. సెకెండాఫ్‌లో ఈ పాత్ర హైలైట్ కానుందని టాక్.

అప్పుడు ఆయన... ఇప్పుడీ యంగ్ హీరో
గతంలో మంచు మనోజ్ హీరోగా నటించిన 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' అనే సినిమాలో నందమూరి బాలకృష్ణ కీలక పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. కానీ, ఈ ఇద్దరు హీరోల మధ్య బంధం మాత్రం మరింత బలపడింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు బాలయ్య సినిమాలో మనోజ్ నటిస్తున్నాడనే టాక్ బాగా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











