నాగార్జున, మంచు మనోజ్ కలిసి చేస్తున్న చిత్రం..డిటేల్స్
తొలిసారిగా నాగార్జున, మంచు మనోజ్ కలిసి ఓ చిత్రంలో చేయనున్నారు. సరోజ,గోవా వంటి విభిన్న మైన చిత్రాలు డైరక్ట్ చేసిన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు త్వరలో ఈ మల్టీ స్టారర్ చిత్రానికి అంకురార్పణ చేయనున్నారు.ఆగస్టు మొదటి వారంలో మొదలయ్యే ఈ సినిమాలో తెలుగు నుంచి నాగార్జున, మంచు మనోజ్ నటిస్తున్నారు. అలాగే తమిళం నుంచి అక్కడ స్టార్ హీరో అజిత్ కీలక పాత్ర చేస్తున్నారు. దయానిధి అళగిరి నిర్మించే ఈ చిత్రం తమిళ వెర్షన్ టైటిల్ మంగత్తా. ఇక హీరోయిన్స్ గా నీతూ చంద్ర, లక్ష్మీ రాయ్ చేస్తూండగా, మిగితా ముఖ్య పాత్రల్లోగణేష్ వెంకట్రామన్,ప్రేమజీ అమరన్ చేస్తున్నారు. ఇక మంచు మనోజ్ నటించిన వేదం చిత్రం కూడా మల్టీ స్టారర్ చిత్రం కావటం విశేషం. తమిళ, తెలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుంది. యవన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. శక్తి శరవణ్ కెమెరా అందిస్తున్న ఈ చిత్రం క్లౌడ్ నైన్ మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. పూర్తి స్దాయి యాక్షన్ చిత్రంగా రూపొందే ఈ చిత్రం మే 1, 2011న ఈ చిత్రం రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.


Click it and Unblock the Notifications











