Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఫ్లాఫ్ ఇచ్చినా అదే దర్శకుడుతో మంచు మనోజ్
హైదరాబాద్:మంచు మనోజ్, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'కరెంట్ తీగ' . ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కువుట్ కాలేదు. అయినా మరో సారి ఈ కాంబినేషన్ లో సినిమా రూపొందనుంది. మంచు విష్ణు నిర్మాతగా రూపొందే ఈ చిత్రం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందనుంది. ఇది ఓ యాక్షన్ కామెడీ అని చెప్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఈ చిత్రం అఫీషియల్ ప్రకటన త్వరలో రానుందని సమాచారం.
పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో హిట్ కొట్టి ఉత్సాహంలో ఉన్న మంచు మనోజ్ తన తదుపరి చిత్రం కరెంట్ తీగతో ప్లాఫ్ ఇచ్చారు. ఇప్పుడు మరో చిత్రానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రం టైటిల్ సన్నాఫ్ పెద రాయుడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో నడుస్తుందని చెప్తున్నారు.
మోహన్‌బాబు కెరీర్లో కలికితురాయి లాంటి సినిమా ‘పెదరాయుడు'.బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధించిన గొప చిత్రమిది. అంతేకాదు డైలాగ్‌కింగ్‌ని ఓ రేంజులో చూపించారీ చిత్రంలో. ఈ సినిమాకి సీక్వెల్ ‘సన్నాఫ్ పెదరాయుడు'.కొత్త దర్శకుడు సాగర్ పసల దర్శకత్వం వహిస్తారని, అమెరికా షెడ్యూల్ మొదలవుతోందని తెలుస్తోంది. ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ-‘‘హాలీవుడ్లో మోషన్ పిక్చర్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వంలో శిక్షణ పొంది, హాలీవుడ్లో ‘డార్క్ ఫీల్డ్స్' చిత్రానికి అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేసి, తెలుగులో ‘కిక్' సురేందర్‌రెడ్డి వద్ద పలు చిత్రాలకు పనిచేసిన పి.సాగర్ని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మంచు మనోజ్‌తో నిర్మిస్తున్న ఈ ‘సన్నాఫ్ పెదరాయుడు' అతి త్వరలో ప్రారంభం అవుతుంది. మనోజ్ కెరీర్‌ని కొత్త మలుపు తిప్పే వైవిధ్యమైన కథతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తాం''అన్నారు.