»   » మంచు మనోజ్ నెక్ట్స్ కి రంగం సిద్దం...డిటేల్స్

మంచు మనోజ్ నెక్ట్స్ కి రంగం సిద్దం...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో హిట్ కొట్టి ఉత్సాహంలో ఉన్న మంచు మనోజ్ తన తదుపరి చిత్రానికి సిద్దమవుతున్నాడు. ఈ చిత్రం టైటిల్ సన్నాఫ్ పెద రాయుడు. ఫిబ్రవరి ఆరు నుంచి చిత్రం ప్రారంభం కానుంది. మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో నడుస్తుందని చెప్తున్నారు.

మోహన్‌బాబు కెరీర్‌లో కలికితురాయి లాంటి సినిమా 'పెదరాయుడు'.బాక్సాఫీస్‌ వద్ద సంచలన వసూళ్లను సాధించిన గొప చిత్రమిది. అంతేకాదు డైలాగ్‌కింగ్‌ని ఓ రేంజులో చూపించారీ చిత్రంలో. ఈ సినిమాకి సీక్వెల్‌ 'సన్నాఫ్‌ పెదరాయుడు'.కొత్త దర్శకుడు సాగర్‌ పసల దర్శకత్వం వహిస్తారని, అమెరికా షెడ్యూల్‌ మొదలవుతోందని తెలుస్తోంది. ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

Manchu Manoj

నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ-''హాలీవుడ్‌లో మోషన్ పిక్చర్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వంలో శిక్షణ పొంది, హాలీవుడ్‌లో 'డార్క్ ఫీల్డ్స్' చిత్రానికి అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేసి, తెలుగులో 'కిక్' సురేందర్‌రెడ్డి వద్ద పలు చిత్రాలకు పనిచేసిన పి.సాగర్‌ని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మంచు మనోజ్‌తో నిర్మిస్తున్న ఈ 'సన్నాఫ్ పెదరాయుడు' అతి త్వరలో ప్రారంభం అవుతుంది. మనోజ్ కెరీర్‌ని కొత్త మలుపు తిప్పే వైవిధ్యమైన కథతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తాం''అన్నారు.


ఇక 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా విడుదలైన రోజే పాజిటివ్ టాక్ రావడంతో పాటు, రివ్యూలు కూడా ఈ సినిమాకు అనుకూలంగా వచ్చాయి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో సినిమాకు ఆదరణ పెరుగుతోంది. 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా ఫ్యామిలీ ప్యాకేజ్ అంటున్నారు సరదాగా. కానీ అక్క లేకపోవడం చిన్న మిస్సింగ్. అయితే అక్క లక్ష్మిపై ఓ పాటని రఫ్‌గా షూట్‌ చేశాం. దాన్ని పూర్తిగా చిత్రీకరించి సినిమాలో కలిపే ఆలోచన ఉంది అంటున్నారు మంచు మనోజ్.

English summary
Manchu Manoj next film tentatively titled “Son of Pedarayudu” under Sagar direction is going to launch on Feb 6th. This film regular shooting will start from March 1st week on-wards. Ramesh Puppala is producing it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu