twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శివకార్తికేయన్​ కోసం రంగంలోకి హాలీవుడ్​ భామ.. ఒలివియా మోరిస్ అనుకున్నారు కానీ?

    |

    తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. బాహుబలి దెబ్బతో తెలుగు సినిమా క్రేజ్ ఖండాంతరాలు దాటడంతో ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తెలుగు హీరోలు ఇతర బాషాల దర్శకులతో సినిమాలు చేయడం ఇతర బాషల హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. మార్కెట్ పెరుగుతున్న దృష్ట్యా హాలీవుడ్ భామలను సైతం తెలుగు సినిమాలలో నటింప చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు నిర్మాతలు.

    ఇప్పటికే రాజమౌళి RRR సినిమాలో హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటించగా ఇప్పుడు మరో తెలుగు సినిమా కోసం హాలీవుడ్ నటిని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే

    తెలుగు తమిళం బాషలలో

    తెలుగు తమిళం బాషలలో

    తమిళ్ హీరో శివ కార్తికేయన్ తెలుగు దర్శకుడు అనుదీప్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు తమిళం బాషలలో ఏక కాలంలో తెరకెక్కిస్తున్నారు.

    అద్శుత‌మైన స్క్రిప్ట్‌

    అద్శుత‌మైన స్క్రిప్ట్‌

    ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవీన్ పోలిశెట్టితో జాతి రత్నాలు బ్లాచేసి క్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకరిగా మారిన అనుదీప్, వరుణ్ డాక్టర్ విజయంతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కోసం అద్శుత‌మైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు.

    అద్శుత‌మైన స్క్రిప్ట్‌

    అద్శుత‌మైన స్క్రిప్ట్‌

    శివకార్తికేయన్ కు 20వ సినిమా అయిన ఈ సినిమా ఫిబ్రవరి 10న లాంఛనంగా ప్రారంభమైంది. అదే రోజు నుండి సినిమా షూటింగ్ కూడా ప్రారంభింఛినట్టు మేకర్స్ ప్రకటించారు. సింగిల్ షెడ్యూల్ గా ఈ సినిమా పాండిచ్చేరిలోని కరైకుడిలో షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ లో నటుడు సత్య రాజ్ కూడా పాల్గొంటున్నారు.

    హాలీవుడ్ భామ

    హాలీవుడ్ భామ

    ఈ SK20 విభిన్నమైన కాన్సెప్ట్‌తో కూడిన వినోదభరితమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందిస్తున్నామని మేకర్స్ గతంలోనే వెల్లడించారు. ఈ సినిమా కథ భారతదేశంలోని పాండిచ్చేరి, UKలోని లండన్ ల నేపథ్యంలో ఉంటుందని సినిమా ప్రకటించినప్పుడే క్లారిటీ ఇచ్చేశారు. కానీ ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించ‌నున్నామని అన్నారు. తాజాగా సమాచారం మేరకు ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన హాలీవుడ్ భామ నటిస్తోందని అంటున్నారు.

    ర్యాబోశాప్క

    ర్యాబోశాప్క

    తాజాగా నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతున్న మేరకు ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన ఉక్రెయిన్​ బ్యూటీ మరియా ర్యాబోషప్క నటించబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అంతకుముందు 'ఆర్​ఆర్​ఆర్'​ భామ ఒలీవియా మోరిస్​ను తీసుకుందామని సినిమా యూనిట్ భావించినట్లు వార్తలు వచ్చాయి.

    కానీ ఆమె ఇప్పటికే ఒక సినిమా చేసి ఉన్న క్రమంలో కొత్త భామ అయితే కొత్త క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఇందులో నిజానిజాలు అధికారిక ప్రకటన వస్తే కానీ క్లారిటీ రాదు.

    English summary
    According to the latest rumors circulating on social media, the film will star Ukrainian beauty Maria Raboshapka opposite Shiva Karthikeyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X