ఫారెన్ బ్యూటీతో విజయ్ దేవరకొండ రొమాన్స్: అందుకే యూఎస్ వెళ్తున్నాడా?
తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే హిట్లు మీద హిట్లు కొట్టి తన రేంజ్ భారీ స్థాయిలో పెంచుకున్నాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడుతున్నాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇలా ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్' చేస్తున్నాడు.
చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న విజయ్ దేవరకొండ.. ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న కసితో చేస్తున్న చిత్రమే 'ఫ్యామిలీ స్టార్'. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం పెట్ల ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. హిట్ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు.

'గీత గోవిందం' వంటి సక్సెస్ తర్వాత రాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుతున్నారు. ఇలా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
విజయ్ - పరశురాం కాంబోలో రాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, ఈ సినిమాలో మరో హీరోయిన్ దివ్యాన్షా కౌశిక్ కూడా మంచి రోల్‌ను చేస్తోంది. వీళ్లు మాత్రమే కాదు.. రష్మిక మందన్నా కూడా ఓ కామియో రోల్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో క్రేజీ న్యూస్ లీకైంది.

'ఫ్యామిలీ స్టార్' మూవీలో ఇక్కడి హీరోయిన్లు మాత్రమే కాకుండా అమెరికాకు చెందిన నటి మరిస్సా రోజ్ గోర్డాన్ కూడా కీలక పాత్రను చేస్తున్నట్లు తెలిసింది. విజయ్ దేవరకొండతో ఆమె సీన్స్ అదిరిపోయేలా ఉంటాయని అంటున్నారు. అందుకే మూవీ యూనిట్ యూఎస్‌లో పలుమార్లు షూట్ జరిపినట్లు తెలుస్తోంది. మారిస్సా పాత్రపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది.
ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ - పరశురాం కలయికలో రూపొందుతోన్న 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











